twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Ghost Official Collections: 4వ రోజు షాకింగ్ కలెక్షన్లు.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే హిట్

    |

    స్టార్ హీరో కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి చిత్రాలతో ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా అలరిస్తూ స్టార్‌డమ్‌ను కొనసాగిస్తున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. అయితే, చాలా కాలం పాటు వరుసగా విజయాలను సొంతం చేసుకున్న ఆయన.. ఈ మధ్య కాలంలో అంతగా ఫామ్‌లో కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే నాగార్జున 'ది ఘోస్ట్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో దసరా కానుకగా విడుదలైన ఈ మూవీకి కలెక్షన్లు అంతగా దక్కట్లేదు. ఈ నేపథ్యంలో 'ది ఘోస్ట్' 4 రోజుల కలెక్షన్లపై మీరూ లుక్కేయండి!

    ఘోస్ట్‌గా టాలీవుడ్ కింగ్ అరాచకం

    ఘోస్ట్‌గా టాలీవుడ్ కింగ్ అరాచకం

    అక్కినేని నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే 'ది ఘోస్ట్'. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించింది. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం అందించారు.

    రష్మిక మందన్నా ఎద అందాల విందు: ఆమెనింత ఘోరంగా ఎప్పుడైనా చూశారా!రష్మిక మందన్నా ఎద అందాల విందు: ఆమెనింత ఘోరంగా ఎప్పుడైనా చూశారా!

    ది ఘోస్ట్ ప్రీ బిజినెస్ వివారాలు

    ది ఘోస్ట్ ప్రీ బిజినెస్ వివారాలు

    టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్' మూవీకి నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 8 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లు, కర్నాటకలో రూ. 65 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లుతో కలిపి మొత్తంగా రూ. 21.15 కోట్లు బిజినెస్ జరిగింది.

    4వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    4వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    'ది ఘోస్ట్ ' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో 4వ రోజు వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 13 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 32 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

    హాట్ షోలో హద్దు దాటిన ఇలియానా: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!హాట్ షోలో హద్దు దాటిన ఇలియానా: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!

    4 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది?

    4 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది?

    4 రోజుల్లో 'ది ఘోస్ట్ ' మూవీకి ఏపీ, తెలంగాణలో తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.08 కోట్లు, సీడెడ్‌లో రూ. 51 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 62 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 33 లక్షలు, కృష్ణాలో రూ. 29 లక్షలు, నెల్లూరులో రూ. 20 లక్షలతో.. రూ. 3.52 కోట్లు షేర్, రూ. 6.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


    ఆంధ్రా, తెలంగాణలో 4 రోజుల్లో రూ. 3.52 కోట్లు మాత్రమే రాబట్టిన 'ది ఘోస్ట్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి రూ. 32 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 46 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇలా అన్ని ఏరియాలూ కలుపుకుని 4 రోజుల్లో నాగార్జున 'ది ఘోస్ట్' రూ. 4.30 కోట్లు షేర్‌, రూ. 8.10 కోట్లు గ్రాస్ రాబట్టింది.

    లోదుస్తులు కూడా లేకుండా నందినీ ఫోజులు: తెలుగమ్మాయి తెగింపు చూశారా!లోదుస్తులు కూడా లేకుండా నందినీ ఫోజులు: తెలుగమ్మాయి తెగింపు చూశారా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


    ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా వచ్చిన 'ది ఘోస్ట్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లుగా నమోదైంది. ఇక, నాలుగు రోజుల్లో దీనికి రూ. 4.30 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 17.70 కోట్లు రాబడితేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

    శనివారం కూడా ఈ కలెక్షన్ల ఏంటి

    శనివారం కూడా ఈ కలెక్షన్ల ఏంటి


    స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' మూవీకి మొదటి రోజు మంచి వసూళ్లు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, కేవలం రూ. 2.45 కోట్లు మాత్రమే ఇది వసూలు చేసింది. ఆ తర్వాత పెరుగుతాయని భావించినా.. క్రమంగా వసూళ్లు పడిపోతోన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం కాస్త కలెక్షన్లు పెరుగుతాయని అంచనా వేసినా.. మళ్లీ తగ్గి ఇది నిరాశనే ఎదుర్కొంది.

    English summary
    Akkineni Nagarjuna Did The Ghost Movie Under Praveen Sattaru Direction. This Movie Collect 4.30 Cr in 4 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X