The Ghost Official Collections: నాగార్జునకు భారీ దెబ్బ.. ఘోస్ట్ హిట్ అవ్వాలంటే ఎంత రావాలో తెలుసా!

అక్కినేని నాగార్జున.. ఈ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్. అంతలా ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా, హోస్టుగా ఎన్నో విధాలుగా ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ స్టార్ హీరో.. గతంలో మాదిరిగా ఇటీవలి కాలంలో విజయాలను సొంతం చేసుకోలేకపోతోన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే నాగార్జున ఇటీవలే 'ది ఘోస్ట్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీకి కలెక్షన్లు అంతగా దక్కట్లేదు. ఈ నేపథ్యంలో 'ది ఘోస్ట్' 5 రోజుల కలెక్షన్లను చూద్దాం పదండి!

 ఘోస్ట్‌గా వచ్చేసిన అక్కినేని హీరో

ఘోస్ట్‌గా వచ్చేసిన అక్కినేని హీరో


అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన చిత్రమే 'ది ఘోస్ట్'. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించింది. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం ఇచ్చాడు.

ది ఘోస్ట్ ప్రీ బిజినెస్ వివారాలు

ది ఘోస్ట్ ప్రీ బిజినెస్ వివారాలు


టాలీవుడ్ స్టార్ నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' మూవీకి నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 8 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లు, కర్నాటకలో రూ. 65 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లుతో కలిపి మొత్తంగా రూ. 21.15 కోట్లు బిజినెస్ అయింది.

5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


'ది ఘోస్ట్ ' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో 5వ రోజు వసూళ్లలో తేడా రాలేదు. ఫలితంగా నైజాంలో రూ. 7 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 32 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

 5 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది?

5 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది?


'ది ఘోస్ట్ ' మూవీకి 5 రోజుల్లో ఏపీ, తెలంగాణలో తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 54 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 71 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, గుంటూరులో రూ. 34 లక్షలు, కృష్ణాలో రూ. 35 లక్షలు, నెల్లూరులో రూ. 21 లక్షలతో.. రూ. 3.84 కోట్లు షేర్, రూ. 6.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


ఆంధ్రా, తెలంగాణలో 5 రోజుల్లో రూ. 3.84 కోట్లు మాత్రమే రాబట్టిన 'ది ఘోస్ట్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి రూ. 33 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 49 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇలా అన్ని ఏరియాలూ కలుపుకుని 5 రోజుల్లో నాగార్జున 'ది ఘోస్ట్' రూ. 4.66 కోట్లు షేర్‌, రూ. 8.75 కోట్లు గ్రాస్ రాబట్టింది.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


నాగార్జున - సోనాల్ చౌహాన్ నటించిన 'ది ఘోస్ట్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 4.66 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 17.34 కోట్లు రాబడితేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X