The Ghost Official Collections: ఘోస్ట్ ఖేల్ ఖతం.. 6వ రోజే ఇంత తక్కువగా.. నాగార్జునకు భారీ దెబ్బ
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా తనదైన నటన, డ్యాన్స్, ఫైట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతోన్నారు కింగ్ అక్కినేని నాగార్జున. కెరీర్ ఆరంభం నుంచే ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ఈ సీనియర్ హీరో.. ఈ ఏడాది ఆరంభంలో 'బంగార్రాజు'తో డీసెంట్ హిట్‌ను అందుకున్నారు. ఈ జోష్‌తోనే ఇటీవలే నాగార్జున 'ది ఘోస్ట్' అనే యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీకి కలెక్షన్లు అంతగా రావట్లేదు. ఈ నేపథ్యంలో 'ది ఘోస్ట్' 6 రోజుల కలెక్షన్లపై లుక్కేద్దాం పదండి!

ఘోస్ట్‌గా ఎంటరైన అక్కినేని హీరో
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రమే 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం అందించాడు.

ది ఘోస్ట్ ప్రీ బిజినెస్ వివారాలు
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ది ఘోస్ట్' మూవీకి నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 8 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లు, కర్నాటకలో రూ. 65 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లుతో కలిపి మొత్తంగా రూ. 21.15 కోట్లు బిజినెస్ జరిగింది.

6వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'ది ఘోస్ట్ ' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో 6వ రోజు వసూళ్లు భారీగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 20 వేలు, వెస్ట్ గోదావరిలో రూ. 80 వేలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 13 లక్షలు షేర్, రూ. 20 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

6 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది?
'ది ఘోస్ట్ ' మూవీకి 6 రోజుల్లో ఏపీ, తెలంగాణలో తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.19 కోట్లు, సీడెడ్‌లో రూ. 56 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 74 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 35 లక్షలు, కృష్ణాలో రూ. 37 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో.. రూ. 3.97 కోట్లు షేర్, రూ. 7.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఆంధ్రా, తెలంగాణలో 6 రోజుల్లో రూ. 3.97 కోట్లు మాత్రమే రాబట్టిన 'ది ఘోస్ట్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి రూ. 34 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 51 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇలా అన్ని ఏరియాలూ కలుపుకుని 6 రోజుల్లో నాగార్జున 'ది ఘోస్ట్' రూ. 4.82 కోట్లు షేర్, రూ. 9.05 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబోలో వచ్చిన 'ది ఘోస్ట్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 4.82 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 17.18 కోట్లు రాబడితేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











