The Ghost Official Collections: నాగ్ పరిస్థితి దారుణం.. 9 రోజుల్లో ఇంతే.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తున్న ఆయన.. వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే నాగార్జున 'ది ఘోస్ట్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్లు చాలా దారుణంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ది ఘోస్ట్' మూవీ 9 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును పరిశీలిద్దాం పదండి!

ఘోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చేసిన నాగ్
అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు తీసిన ఫుల్ యాక్షన్ మూవీనే 'ది ఘోస్ట్'. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం అందించాడు. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించింది.

ది ఘోస్ట్ ప్రీ బిజినెస్ వివారాలు
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ది ఘోస్ట్' మూవీకి నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 8 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లు, కర్నాటకలో రూ. 65 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లుతో కలిపి మొత్తంగా రూ. 21.15 కోట్లు బిజినెస్ జరిగింది.

9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ది ఘోస్ట్ ' మూవీకి టాక్ ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో ఆ ప్రభావం కలెక్షన్లపై చూపించింది. ఫలితంగా ఈ సినిమాకు ఓపెనింగ్స్‌తో పాటు ఆ తర్వాత కూడా వసూళ్లు చాలా దారుణంగా వచ్చాయి. ఇదే కంటిన్యూ అవుతూ 9వ రోజు కూడా ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం రూ. 4 లక్షలు మాత్రమే వసూలు చేసి అందరికీ షాకిచ్చింది.

9 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది?
'ది ఘోస్ట్ ' మూవీకి 9 రోజుల్లో ఏపీ, తెలంగాణలో వసూళ్లు డల్‌గా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 57 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 78 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 37 లక్షలు, కృష్ణాలో రూ. 40 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో.. రూ. 4.14 కోట్లు షేర్, రూ. 7.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
9 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 4.14 కోట్లు మాత్రమే రాబట్టిన 'ది ఘోస్ట్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి రూ. 35 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 55 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇలా అన్ని ఏరియాలూ కలుపుకుని 9 రోజుల్లో నాగార్జున 'ది ఘోస్ట్' మూవీ రూ. 5.04 కోట్లు షేర్, రూ. 9.50 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
నాగార్జున హీరోగా నటించిన 'ది ఘోస్ట్' చిత్రానికి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లుగా నమోదైంది. ఇక, తొమ్మిది రోజుల్లో దీనికి రూ. 5.04 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 16.96 కోట్లు రాబడితేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











