The Ghost Official Day 1 Collections: నాగార్జునకు బిగ్ షాక్.. తొలి రోజు ఇంతే.. గాడ్ ఫాదర్‌ కంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా హవాను చూపించడంతో పాటు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తోన్న హీరోల్లో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. చాలా కాలం పాటు హిట్ లేక ఇబ్బందులు పడిన ఆయన.. ఈ ఏడాది ఆరంభంలోనే 'బంగార్రాజు'తో సక్సెస్ బాట పట్టారు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు నాగార్జున 'ది ఘోస్ట్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో దసరా కానుకగా విడుదలైన ఈ మూవీకి తొలి రోజు షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో 'ది ఘోస్ట్' మొదటి రోజు కలెక్షన్లపై లుక్కేద్దాం పదండి!

 ది ఘోస్ట్‌గా ఎంటరైన నాగార్జున

ది ఘోస్ట్‌గా ఎంటరైన నాగార్జున

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన చిత్రమే 'ది ఘోస్ట్'. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించింది. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం అందించారు.

ది ఘోస్ట్ ప్రీ బిజినెస్ వివారాలు

ది ఘోస్ట్ ప్రీ బిజినెస్ వివారాలు


కింగ్ అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' మూవీకి నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 8 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లు, కర్నాటకలో రూ. 65 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లుతో కలిపి మొత్తంగా రూ. 21.15 కోట్లు బిజినెస్ జరిగింది.

 అలాంటి టాక్.. కలెక్షన్లపై ఎఫెక్ట్

అలాంటి టాక్.. కలెక్షన్లపై ఎఫెక్ట్


ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ది ఘోస్ట్' మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో ఈ సినిమాకు అనుకున్న విధంగా ఓపెనింగ్ డేన ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు.

తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


'ది ఘోస్ట్ ' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో ఫస్ట్ డే తక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 57 లక్షలు, సీడెడ్‌లో రూ. 24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 31 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 22 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలతో కలిపి రూ. 2.00 కోట్లు షేర్, రూ. 3.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

 ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఆంధ్రా, తెలంగాణలో చాలా తక్కువగా రూ. 2.00 కోట్లు మాత్రమే రాబట్టిన 'ది ఘోస్ట్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి రూ. 20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 25 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇలా అన్ని ఏరియాలూ కలుపుకుని తొలి రోజు నాగార్జున 'ది ఘోస్ట్' రూ. 2.45 కోట్లు షేర్‌, రూ. 4.60 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


విడుదలకు ముందే అంచనాలు ఏర్పరచుకున్న 'ది ఘోస్ట్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 2.45 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 19.55 కోట్లు రాబడితేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

దెబ్బ కొట్టిన చిరంజీవి సినిమా

దెబ్బ కొట్టిన చిరంజీవి సినిమా


అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' మూవీకి మొదటి రోజు మంచి వసూళ్లు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, కేవలం రూ. 2.45 కోట్లు మాత్రమే ఇది వసూలు చేసింది. ఈ మూవీకి కలెక్షన్లు తగ్గడానికి చిరంజీవి 'గాడ్ ఫాదర్' ఒక కారణంగా చెప్పొచ్చు. ఈ చిత్రం ఏకంగా రూ. 16 కోట్లు వరకూ రాబట్టింది. అంటే 'ది ఘోస్ట్' అందులో 8వ వంతు మాత్రమే రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X