Ghost Business: ది ఘోస్ట్ మూవీకి షాకింగ్ బిజినెస్.. అన్ని కోట్లు వస్తేనే హిట్.. ఇది ఎవరూ ఊహించరు!
సుదీర్ఘ కాలంగా తనదైన శైలి యాక్టింగ్, స్టైల్స్, ఫైట్స్ ఇలా ఎన్నో రంగాల్లో రాణిస్తూ టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్నారు కింగ్ అక్కినేని నాగార్జున. తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్న ఈ హ్యాండ్సమ్ హీరో.. ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను భారీగా పెంచుకున్నారు. దీంతో అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోన్నారు. ఇలా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న ఆయన.. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలను చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నాగార్జున 'ది ఘోస్ట్' అనే మూవీతో రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఎక్కడ? ఎంత? బిజినెస్ జరిగింది? అనే వివరాలు చూద్దాం పదండి!

ది ఘోస్ట్‌గా రాబోతున్న నాగార్జున
కింగ్ అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రమే 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించింది. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం అందించారు.

అలాంటి స్టోరీ... ఫుల్ యాక్షన్‌తో
ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా పని చేసే విక్రమ్ గాంధీ అనే వ్యక్తి ఘోస్టుగా ఎలా మారాడు? నేర సామ్రాజ్యాన్ని గడగడలాడించే శక్తిగా ఎలాంటి ప్రభావాన్ని చూపించాడు? అనే అంశాలతో 'ది ఘోస్ట్' మూవీ తెరకెక్కింది. ఇందులో అక్కినేని నాగార్జున యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు. ఈ మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. దీంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

ప్రమోషన్స్ షురూ.. సందడిగానే
కింగ్ అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసుకున్నారు. ఇక, మంగళవారం సాయంత్రమే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఏపీ, తెలంగాణలో బిజినెస్ ఇలా
నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా తక్కువగానే బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలుపుకుని రూ. 8 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తంగా రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది.

ప్రపంచ వ్యాప్తంగా జరిగిందిలా
కింగ్ నాగార్జున మార్కెట్‌కు అనుగుణంగానే 'ది ఘోస్ట్' మూవీ థియేట్రికల్ హక్కుల కోసం పోటీ ఏర్పడింది. దీంతో ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 2.50 కోట్లు, కర్నాటకలో రూ. 65 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి మొత్తంగా రూ. 21.15 కోట్లు బిజినెస్ జరిగింది. ఫలితంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లుగా నమోదైంది.

చాలా తగ్గిపోయిన ప్రీ బిజినెస్
వాస్తవానికి కింగ్ నాగార్జున సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. అయితే, కరోనా సమయంలో వచ్చిన 'వైల్డ్ డాగ్' రూ. 10 కోట్ల లోపే వ్యాపారం చేసుకుంది. కానీ, ఆ తర్వాత వచ్చిన 'బంగార్రాజు' మాత్రం రూ. 30 కోట్లు దాటేసింది. అలాంటిది ఇప్పుడు రాబోతున్న 'ది ఘోస్ట్'కు కేవలం రూ. 21.15 కోట్లే బిజినెస్ జరగడం చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











