Don't Miss!
- News Arvind Kejriwal..జైల్లో కేజ్రీవాల్ తిన్నది మూడు మామిడిపండ్లే: ఈడీ చీప్ అభియోగాలు
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Wild Dog Pre-Release Business.. బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేయాలంటే?
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున చాలా కాలం తరువాత ఒక డిఫరెంట్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. NIA బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ గా తెరకెక్కిన వైల్డ్ డాగ్ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం నాగార్జున నెవర్ బిఫోర్ అనేలా ప్రమోషన్ చేస్తున్నారు. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద మీడియం రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగుతోంది. చూస్తుంటే ఆ టార్గెట్ ను ఈజీగా అందుకునేలా ఉందని అనిపిస్తోంది.
వాలు చూపుతో వయ్యారాల విందు.. సమంత హాట్ పిక్స్ వైరల్
మళ్ళీ పదేళ్ల తరువాత
గగనం సినిమాతో ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ఇచ్చిన నాగార్జున మళ్ళీ పదేళ్ల అనంతరం అలాంటి స్టైల్ లోనే మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో రాబోతున్నారు. వరల్డ్ వైడ్ గా వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో నాగార్జున ఒక NIA ఏజెంట్ గా కనిపించబోతున్నాడు.
అసలు కథ ఇదే
రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఆశిషోర్ సోలమన్ ఈ సినిమాను రూపొందించాడు. గోకుల్ చాట్ బ్లాస్ట్ వంటి సంఘటనలను కూడా సినిమాలో చూపించబోతున్నారు. బ్లాస్ట్ కు కారణమైన ఉగ్రవాదుల ముఠాను పట్టుకోవాలనే ఒక టార్గెట్ తో సినిమా కథ కొనసాగుతుందట.
టార్గెట్ చిన్నదే అయినా..
సినిమా మెయిన్ స్టోరీతోనే అంచనాల డోస్ పెంచేశారు. ఇక ప్రమోషన్ కూడా సినిమాకు తగ్గట్లుగానే కొనసాగిస్తున్నారు. సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అయితే అంచనాలు గట్టిగానే పెరిగాయి. ఇక సినిమా బాక్సాఫీస్ టార్గెట్ నాగ్ రేంజ్ కు చిన్నదే అయినా పాజిటివ్ టాక్ వస్తేనే ఈజీగా బ్రేక్ ఈవెన్ ను సాదించగలరు.
వైల్డ్ డాగ్ ప్రీ రిలీజ్ బిజినెస్
సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే 8కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా మొత్తం 9కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి దిగుతున్నట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. దర్శకుడు ఆశిషోర్ సోలమన్ ఇంతకుముందు మహర్షి, ఊపిరి వంటి సినిమాలకు రైటర్ గా వర్క్ చేశాడు.
భారీ ఆఫర్ వచ్చినప్పటికీ
అసలైతే ఈ సినిమాకు లాక్ డౌన్ సమయంలోనే నెట్ ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. డైరెక్ట్ గా ఓటీటీ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. డీల్ కూడా క్లోజ్ అయ్యింది. కానీ లాక్ డౌన్ అనంతరం సినిమాలకు జనాలు ఎగబడి వస్తుండడంతో మళ్ళీ నిర్ణయాన్ని మార్చుకొని థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం చేశారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో క్లిక్కవుతుందో చూడాలి.