twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Wild Dog Day 4 collections.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా.. చిరంజీవి చెప్పినా ముఖం చాటేసిన ప్రేక్షకులు..

    |

    టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నది. రోజు రోజుకు అంతకు మించి వసూళ్లు దారుణంగా క్షీణిస్తున్నాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద నాగార్జునకు తన కెరీర్‌లో మరోసారి దారుణమైన ఫలితం ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. వైల్డ్ డాగ్‌ 4వ రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

    వైల్డ్ డాగ్ సినిమా చూసి రోమాలు నిక్కబొడుచుకొన్నాయి.. నాగ్‌పై చిరంజీవి ప్రశంసలు (ఫొటోలు)

    తొలి రోజున పాజిటివ్‌గానే

    తొలి రోజున పాజిటివ్‌గానే

    భారీ అంచనాలతో ఏప్రిల్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైల్డ్ డాగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగానే కలెక్షన్లు నమోదయ్యాయి. తొలి రోజున రూ.1.21 కోట్లు సాధించింది. అయితే అదే ఊపును కొనసాగించలేకపోయిన ఈ చిత్రం రెండో రోజున 50 శాతం క్షీణతతో కేవలం 64 లక్షల కలెక్షన్లను నమోదు చేసింది.

    చిరంజీవి సినిమాపై రివ్యూ

    చిరంజీవి సినిమాపై రివ్యూ

    ఇలాంటి పరిస్థితుల్లో వైల్డ్ డాగ్‌కు మరింత ప్రోత్సాహం అందించేందుకు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. నాగార్జున సినిమాకు ప్రేక్షకాదరణ లభించేలా చిరంజీవి అద్బుతమైన రివ్యూను సోమవారం ప్రెస్ మీట్‌లో ఇచ్చారు. అయినా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా.. ఈ చిత్రం కలెక్షనపై ప్రభావం చూపించడంలో విఫలమైంది.

    4వ రోజున వైల్డ్ డాగ్ బాక్సాఫీస్ పరుగు

    4వ రోజున వైల్డ్ డాగ్ బాక్సాఫీస్ పరుగు

    ఇక నాలుగో రోజున ఈ చిత్రం కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ.8 లక్షలు, సీడెడ్‌లో రూ.3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.4 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో3.2 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ.2 లక్షలు, గుంటూరులో రూ.2.2 లక్షలు, నెల్లూరులో రూ.1.8 లక్షలు వసూలు చేసింది. దాంతో నైజాం, ఏపీలో మొత్తంగా 27 లక్షలు మాత్రమే వసూలు చేసింది.

    నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా

    నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా

    గత నాలుగు రోజుల్లో వైల్డ్ డాగ్ సినిమా కలెక్షన్లు పరిశీలిస్తే.. ఏపీ, నైజాంలో రూ.2.72 కోట్లు నికర వసూళ్లు, రూ.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటక, మిగితా రాష్ట్రాల్లో మొత్తంగా రూ.13 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.25 లక్షలు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.3.10 కోట్లు నికరంగా, రూ.6 కోట్లు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

    వైల్డ్ డాగ్ ప్రాఫిట్‌లోకి రావాలంటే

    వైల్డ్ డాగ్ ప్రాఫిట్‌లోకి రావాలంటే

    ఇక వైల్డ్ డాగ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాపంగా ఈ చిత్రం సుమారు రూ.9 కోట్ల మేర బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రూ.9.4 కోట్లుగా సెట్ అయింది. అయితే ప్రస్తుతం నమోదు అవుతున్న వసూళ్లను చూస్తే కష్టంగానైనా బ్రేక్ ఈవెన్ సాధించే పరిస్థితి కనిపిచండం లేదునే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.

    English summary
    Tollywood King Nagarjuna's Wild Dog movie released on April 2nd worldwide.This movie started journey with high note at box office. But last couple of days, This movie did not do well. 50 percent collections dropped worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X