నాగశౌర్య 'లక్ష్య'కు ఊహించని విధంగా ఊరట.. కానీ అదొక్కటే పెద్ద గండం.. అది దాటితే హిట్టే!
కుర్ర హీరో నాగశౌర్య నటించిన లక్ష్య సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నాగ శౌర్యకు అనుకోకుండా ఒక లక్ కలిసి వచ్చింది ఆ వివరాల్లోకి వెళితే

‘లక్ష్య’
నాగశౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న చిత్రం 'లక్ష్య'. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నస్తుండగా జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్
విభిన్న కథా నేపథ్యంతో సంతోష్ జాగర్లపూడి ప్రయోగం చేసేందుకు రాబోతున్నారు. కీరవాణి కుమారుడు కాల భైరవ సంగీతాన్ని సమకూర్చగా.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా, జునైద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు.

అఖండ మానియా
ఆ సంగతి అలా ఉంచితే ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం ఈ వారం బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. ఈ వీకెండ్‌లో దూసుకుపోతున్న ఈ సినిమా వర్కింగ్ డేస్‌లో ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి సినిమా ఇంత వరకు ఎలా ఉందో అదే జోరు కనుక ఈ వీక్ డేస్ లో కూడా చూపగలిగితే రెండో వారంలో కూడా అఖండకు ఫ్రీ గ్రౌండ్ వస్తుంది.

మూడే సినిమాలు
అయితే ఈ వారం పెద్ద సినిమాలు లేకపోయినా కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలవుతున్నాయి. నాగ శౌర్య యొక్క లక్ష్య , కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి , ఇళయరాజా సంగీతం అందించగా శ్రియ, నిత్య మీనన్ వంటి వారు నటించిన గమనం, అలాగే మడ్డీ డిసెంబర్ 10 న విడుదల చేస్తారని భావించారు.

లక్కు తెచ్చిపెట్టింది
కానీ అనూహ్యంగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన 'గుడ్ లక్ సఖి' సినిమా విడుదల మరో సారి వాయిదా పడింది. వాస్తవానికి, ఈ సినిమా ఎప్పుడో విడుదలకు సిద్ధం అయ్యింది. కరోనా దెబ్బకు అన్ని సినిమాలు వాయిదా పడినట్లు ఈ సినిమా కూడా వాయిదా పడింది. సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత నెమ్మదిగా సినిమాలు థియేటర్లలోకి రావడం మొదలవడంతో 'గుడ్ లక్ సఖి'ని నవంబర్ 26న విడుదల చేయాలని అనుకున్నారు.

మళ్ళీ వాయిదా
అయితే ఏమయిందో ఏమో తెలియదు కానీ రిలీజ్ డేట్ ప్రకటించిన కొన్ని రోజులకు అప్పటి పరిస్థితుల దృష్ట్యా... డిసెంబర్ 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించినట్టు నిర్మాతలు ప్రకరించారు. అయితే ఏమయిందో ఏమో తెలియదు కానే ఇప్పుడు మరోసారి ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
Recommended Video

ఆ ఒక్కదానితో పోటీ
దీంతో ఇప్పటికే వరుడు కావలెను ఫ్లాప్ తో ఇబ్బందులు పడుతున్న నాగశౌర్య కు లక్ కలిసి వచ్చినట్టు అయింది. అంటే సినిమాకు ప్రధాన పోటీ అని భావించిన సినిమా వెనక్కువెళ్ళడంతో కేవలం అఖండ ధాటికి తట్టుకుని నిలబడితే సరిపోతుంది. ఇక ఈ మూడు సినిమాలూ ఒక్కో విధంగా ఒక్కో విధంగా అమ్ముడయ్యాయి. ఈ సినిమాలలో ఏ ఒక్క దానికి మంచి టాక్ వచ్చినా అఖండకు ముప్పు తప్పదు. అప్పటి వరకు నిలదొక్కుకోవడమే సినిమాకు ప్రధాన సవాలుగా చెబుతున్నారు. అఖండ హిట్ కావాలంటే ప్రపంచవ్యాప్త థియేట్రికల్ బిజినెస్ నుండి 56 కోట్ల షేర్ వసూలు చేయాలి. ఇప్పటికే సినిమా 30 కోట్ల మేర వసూళ్లు సాధించింది.


Click it and Unblock the Notifications











