Akhanda 19 days collections : జోరు తగ్గని బాలయ్య.. 19వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?

'సింహా', 'లెజెండ్' లాంటి సూపర్ హిట్స్ తరువాత బోయపాటి.. బాలయ్య కలిసి 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా మంచి నుంచి కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక ఇప్పటికే బ్రేక్ ఈవెన్ చేసిన ఈ సినిమా లాభాల బాటలో నడుస్తోంది. 'పుష్ప' హవా ఉన్నా 19వ రోజు మంచి వసూళ్లని రాబట్టింది. 19 రోజుల్లో సినిమా ఎంత వసూలు చేసిందో పరిశీలిస్తే

Recommended Video

2021 Year Ender : Tollywood Top Gross Collected Movies In 2021
బ్లాక్ బస్టర్

బ్లాక్ బస్టర్

నటసింహా నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో సుదీర్ఘ గ్యాప్ తరువాత వచ్చిన సినిమా 'అఖండ'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించగా బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్, నితిన్ మెహతాలు విలన్స్ గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. డిసెంబర్ 2న గ్రాండ్‌గా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అంటే?

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అంటే?

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే మునుపెన్నడూ లేని విధంగ'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్ అని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రలలో మాత్రమే కాక భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేశారు.

19వ రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

19వ రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

రిలీజ్ రోజు నుంచే 'అఖండ' మూవీకి పాజిటివ్ టాక్ సహా భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. దాదాపు పది రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలకు పైగానే ఈ సినిమా వసూలు చేసింది. కానీ, అప్పటి నుంచి క్రమంగా డ్రాప్ అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే 19వ రోజు పుష్ప హవా ఉన్నా కూడా అఖండ మూవీ తన హవా కొనసాగించింది. సోమవారం నాడు అంటే వీక్ డే లో కూడా శనివారం రూ. 42 లక్షలు షేర్‌ను రాబట్టి సత్తా చాటింది.

19 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

19 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

'అఖండ'కు 19 రోజుల్లో భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 19.05కోట్లు, సీడెడ్‌లో రూ. 14.51 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.88 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.95 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.34 కోట్లు, గుంటూరులో రూ.4.53 కోట్లు, కృష్ణాలో రూ. 3.44 కోట్లు, నెల్లూరులో రూ.2.50 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 57.20 కోట్లు షేర్, రూ. 94 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ ఎంత?

ఏపీ తెలంగాణలో సత్తా చాటిన 'అఖండ'.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో 19 రోజులకు కలిపి రూ. 57.20 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.82 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.58 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.60 కోట్లు షేర్, రూ. 118.3కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

లాభాలు ఎంత?

లాభాలు ఎంత?

ఎన్నో అంచనాలతో వచ్చిన 'అఖండ' మవీకి అంచనాలకు అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 19 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.60 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 13.60 కోట్లు లాభాలను కూడా ఖాతాలో వేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X