twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Akhanda Day 2 Collections: మరోసారి బాలయ్య ఊచకోత.. జెట్ స్పీడ్ లో టార్గెట్ ఫినిష్ అయ్యేలా కలెక్షన్స్!

    |

    నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా రెండవ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటింది. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలయ్య తన కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం. ఇక సినిమాకు సంబంధించిన ప్రతీ అంశం కూడా పబ్లిక్ లో భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తోంది. దీంతో ఈ వారం అఖండ హవా గట్టిగానే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక సినిమాకు సంబంధించిన రెండవ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే..

    ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రీ రిలీజ్ బిజినెస్

    అఖండ మొత్తంగా 59కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అఖండ సినిమా నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదల అయ్యింది. ఇక బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వాలి అంటే మొత్తంగా 60కోట్లకు పైగా వసూళ్లను అందుకోవాల్సి ఉంటుంది. మొదటి రోజు వచ్చిన షేర్ ను బట్టి చూస్తే ఈ సినిమా ఈ వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    హాఫ్ మిలియన్ కొట్టేసిన అఖండ

    హాఫ్ మిలియన్ కొట్టేసిన అఖండ

    మొత్తానికి అనుకున్నట్లుగానే అఖండ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా తన సత్తాను చాటింది. జై బాలయ్య నినాదాలు విదేశాల్లో కూడా ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. యూఎస్ కూడా అఖండ సినిమా ప్రీమియర్స్ తోనే 331,803 డాలర్లు అందుకుంది. మొదటిరోజు 101,458కోట్ల వసూళ్లు రాగా మొత్తంగా 3.24 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో షాక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం హాఫ్ మిలియన్ దాటేసినట్లు సమాచారం.

     రెండవరోజు కలెక్షన్స్..

    రెండవరోజు కలెక్షన్స్..

    నైజాంలో బలమైన మార్కెట్ ఉన్న బాలయ్యకు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండవరోజు నైజాంలో అఖండ 2.24కోటక షేర్ రాబట్టింది. ఆంద్రప్రదేశ్ లో కూడా టికెట్ల రేట్లు దెబ్బకొట్టినప్పటికి స్టాండర్డ్ గానే వసూళ్లు అందుతున్నాయి. అన్ని ఏరియాల్లోనూ థియేటర్లు మారుమ్రోగి పోతున్నాయి. ఇక నైజాం ఏరియాలో ఈ సినిమా మొదటి రోజే 4.39 కోట్లు అందుకుంది.. రెండవరోజు 2.24కోట్లు వచ్చాయి. ఇంకా పూర్తి ఏరియాల్లో సీడెడ్ లో 1.98కోట్లు, ఉత్తరాంధ్ర 69లక్షలు, ఈస్ట్ 46 లక్షలు, వెస్ట్ 34లక్షలు, గుంటూరులో 41లక్షలు, కృష్ణ 44 లక్షలు, నెల్లూరు 25 లక్షలు.

    తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల కలెక్షన్స్

    తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల కలెక్షన్స్

    ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొదటి రోజే అఖండ 15.39కోట్ల షేర్ రాబట్టి బాలయ్య బోయపాటి కెరీర్ లోనే సంచలన రికార్డును నమోదు చేసింది. సెకండ్ వేవ్ అనంతరం లవ్ స్టోరీ సినిమా రికార్డులను అఖండ బ్రేక్ చేసినట్లుగా క్లారిటీ వచ్చేసింది. రెండవరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో 6.83కోట్ల షేర్ వచ్చింది. అంటే రెండు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా 22కోట్లకు పైగా షేర్ సాధించినట్లు సమాచారం.

    బాలయ్య కెరీర్ లో అత్యధికంగా..

    బాలయ్య కెరీర్ లో అత్యధికంగా..

    ఒక విధంగా కరోనా లాక్‌డౌన్‌ అనంతరం అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న టాప్ సినిమాల్లో అఖండ కూడా నిలుస్తుందనే అర్థమవుతుంది. అంతే కాకుండా బాలకృష్ణ కెరీర్ లోనే ఈ సినిమా అత్యదిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే మిగతా దేశాల్లో సినిమా 5కోట్లకు పైగా షేర్ సాధించిన అఖండ వరల్డ్ వైడ్ గా మొత్తంగా 26కోట్ల షేర్ సాధించింది.

    వరల్డ్ వైడ్ గా..

    వరల్డ్ వైడ్ గా..

    ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే గ్రాడ్ 29.60కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రెండు రోజుల్లో 44కోట్లకు పైగా గ్రాస్ దక్కినట్లు సమాచారం. మరి సినిమా మిగతా వీకెండ్స్ లో ఏ స్థాయిలో వసూళ్లను ఎలా సాధిస్తుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు అనుకున్నంతగా లేకపోయినప్పటికీ కూడా బాలయ్య బాబు తన స్టార్ హోదాతో జనాలను భారీస్థాయిలో మెప్పించాడు.

    ఇంకా ఎంత రావాలి అంటే..

    ఇంకా ఎంత రావాలి అంటే..

    ఇక బాలకృష్ణ కూడా బాక్స్ ఆఫీసు వద్ద సక్సెస్ చూసి చాలా కాలం అయింది. అంతే కాకుండా ఓ విభిన్నమైన క్యారెక్టర్ లో చూసి కూడా చాలా కాలమైంది. మొత్తానికి సినిమాలో అఖండ పాత్ర థియేటర్స్ ను షేక్ చేశాయి. ఆంధ్రప్రదేశ్లోని సినిమా షేర్ కలక్షన్స్ కూడా గట్టిగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 30కోట్లకు పైగా షేర్ సాదించాల్సి ఉంది. మరి ఆ టార్గెట్ ను ఈ రెండు రోజుల్లో సాధిస్తుందో లేదో చూడాలి.

    English summary
    Balakrishna's Akhanda Day 2 Box Office Collections: balakrishna Gets Career Best Numbers
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X