Akhanda 17days Collections: భారీగా పెరిగిన అఖండ కలెక్షన్స్.. పుష్ప హవా ఉన్నా అన్ని లక్షలు వసూలు

గతంలో వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న తరుణంలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో 'సింహా' అనే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఆ తర్వాత మళ్లీ దాదాపుగా అలాంటి పరిస్థితిలోనే ఉన్న సమయంలో 'లెజెండ్' వీళ్లిద్దరూ మరో సక్సెస్‌ను అందుకున్నారు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత బోయపాటి.. బాలయ్య కలిసి 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఆరంభం నుంచే కలెక్షన్లను కొల్లగొట్టింది.

ఫలితంగా టార్గెట్‌ను చేరుకోవడంతో పాటు లాభాల బాటను కూడా పట్టేసింది. ఇప్పుడు 'పుష్ప' హవా ఉన్నా 17వ రోజు మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పటి వరకూ ఇది ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

అఖండగా మారిపోయిన నటసింహా

అఖండగా మారిపోయిన నటసింహా

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన చిత్రమే 'అఖండ'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న గ్రాండ్‌గా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

బాలయ్య కెరీర్‌లో రెండవ హయ్యస్ట్

బాలయ్య కెరీర్‌లో రెండవ హయ్యస్ట్

ఏపీ తెలంగాణతో పాటు బాలకృష్ణకు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్ కావడం గమనార్హం. అందుకే దీన్ని భారీ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు.

17వ రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

17వ రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

రిలీజ్ రోజు నుంచే 'అఖండ' మూవీకి భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. దాదాపు పది రోజుల పాటు తెలుగ రాష్ట్రాల్లో కోటి రూపాయలకు పైగానే ఈ సినిమా వసూలు చేసింది. కానీ, అప్పటి నుంచి క్రమంగా డ్రాప్ అవుతోంది. ఈ క్రమంలోనే 17వ రోజు పుష్ప హవా ఉన్నా కూడా అఖండ మూవీ బాగానే పుంజుకుంది. దీంతో శనివారం రూ. 46 లక్షలు షేర్‌ను రాబట్టి సత్తా చాటింది.

17 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

17 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

'అఖండ'కు 17 రోజుల్లో భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 18.58 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.19 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.78 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.89 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.24 కోట్లు, గుంటూరులో రూ. 4.48 కోట్లు, కృష్ణాలో రూ. 3.39 కోట్లు, నెల్లూరులో రూ. 2.45 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 56 కోట్లు షేర్, రూ. 91.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఏపీ తెలంగాణలో సత్తా చాటిన 'అఖండ'.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో 17 రోజులకు కలిపి రూ. 56 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.66 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.28 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 65.94 కోట్లు షేర్, రూ. 114.15 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

ఎన్నో అంచనాలతో వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 17 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 65.94 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 11.94 కోట్లు లాభాలను కూడా ఖాతాలో వేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X