Akhanda 18days Collections: ఆదివారం అఖండ అరాచకం.. ఏకంగా అన్ని కోట్ల లాభాలతో బాలయ్య మరో రికార్డు
చాలా కాలంగా సరైన హిట్ లేక తెగ ఇబ్బందులు పడుతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. అయినప్పటికీ ఆయన వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే వచ్చారు. కానీ, అవేమీ ఆయనను హిట్ ట్రాక్ ఎక్కించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో తనకు 'సింహా', 'లెజెండ్' వంటి భారీ విజయాలను అందించిన బోయపాటి శ్రీనుతో జతకట్టారు. ఇలా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఇటీవల వచ్చిన చిత్రమే 'అఖండ'.
భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఆరంభం నుంచే కలెక్షన్లను కొల్లగొట్టింది. ఫలితంగా టార్గెట్‌ను చేరుకోవడంతో పాటు లాభాల బాటను కూడా పట్టేసింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ 18 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

అఖండగా రచ్చ చేసిన నటసింహా
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రమే 'అఖండ'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న గ్రాండ్‌గా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

బాలయ్య కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా
తెలుగు రాష్ట్రాలతో పాటు బాలకృష్ణకు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్ కావడం గమనార్హం. అందుకే దీన్ని భారీ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో తీసుకు వచ్చారు.

18వ రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?
'అఖండ' మూవీకి మొదటి రోజు నుంచే భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అలా పది రోజుల పాటు ఏపీ తెలంగాణలో కలిపి కోటి రూపాయలకు పైగానే ఈ సినిమా వసూలు చేసింది. కానీ, అప్పటి నుంచి క్రమంగా డ్రాప్ అవుతోంది. ఈ క్రమంలోనే 16వ రోజు నుంచి పుంజుకుంది. దీంతో ఆదివారం ఏకంగా చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులతో రూ. 68 లక్షలు షేర్‌ను అందుకుంది.

18 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
'అఖండ'కు 18 రోజులకు కలిపి భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 18.92 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.38 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.85 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.83 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.29 కోట్లు, గుంటూరులో రూ. 4.51 కోట్లు, కృష్ణాలో రూ. 3.42 కోట్లు, నెల్లూరులో రూ. 2.48 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 56.68 కోట్లు షేర్, రూ. 93 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
రెండు రాష్ట్రాల్లో సత్తా చాటిన 'అఖండ'.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. రెండు రాష్ట్రాల్లో 18 రోజులకు కలిపి రూ. 56.68 కోట్లు అందుకున్న ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.34 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 66.72 కోట్లు షేర్, రూ. 115.50 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.
Recommended Video

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?
హిట్ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 18 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 66.72 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 12.72 కోట్లు లాభాలతో మర రికార్డును క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











