Akhanda 1st Week Collections: వారంలో అన్ని కోట్లతో అరాచకం.. అఖండకు ఇంకో 51 లక్షలు వస్తే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న వాటిలో నటసింహా నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను జోడీ ఒకటి. ఈ ఇద్దరితో పాటు ఇండస్ట్రీకీ కూడా భారీ సక్సెస్ కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ జంట 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ మూవీ ఏడో రోజు కలెక్షన్లు పర్వాలేదనిపించాయి. ఫలితంగా మొదటి వారంలో మంచి కలెక్షన్లను రాబట్టడంతో పాటు మరో టార్గెట్‌కు మరింత చేరువ అయింది. మరి ఈ సినిమా ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం పదండి!

‘అఖండ'గా మారిపోయిన బాలయ్య

‘అఖండ'గా మారిపోయిన బాలయ్య

'సింహా', 'లెజెండ్' తర్వాత నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన చిత్రమే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న రిలీజ్ అయింది.

అత్యధిక స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్

అత్యధిక స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్

స్టార్ హీరో బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్. ఈ మూవీ రేంజ్‌ను బట్టే దీన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు

ఏడో రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

ఏడో రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

అఖండకు తెలుగు రాష్ట్రాల్లో ఏడవ రోజు కలెక్షన్లు పర్వాలేదనిపించాయి. ఫలితంగా నైజాంలో రూ. 54 లక్షలు, సీడెడ్‌లో రూ. 35 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 18 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 1.44 కోట్లు షేర్, రూ. 2.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఏడు రోజులకు కలిపి ఎంత వచ్చింది?

ఏడు రోజులకు కలిపి ఎంత వచ్చింది?

'అఖండ' మూవీకి ఏడు రోజులకు కలిపి భారీ వసూళ్లు వచ్చాయి. నైజాంలో రూ. 14.87 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.73 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.56 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.08 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.43 కోట్లు, గుంటూరులో రూ. 3.73 కోట్లు, కృష్ణాలో రూ. 2.73 కోట్లు, నెల్లూరులో రూ. 1.98 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 45.11 కోట్లు షేర్, రూ. 71.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంతంటే

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంతంటే

రెండు రాష్ట్రాల్లో సత్తా చాటిన 'అఖండ'.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజులకు రూ. 44.11 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.82 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.56 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 53.49 కోట్లు షేర్, రూ. 87.90 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలి?

సక్సెస్‌ఫుల్ కాంబోలో వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 56 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఏడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53.49 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 51 లక్షలు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

Recommended Video

Bheemla Nayak : Bheemla Nayak Is Not Releasing To Pongal ? || Filmibeat Telugu
ఆ రెండింటికీ చేరువలో అఖండ మూవీ

ఆ రెండింటికీ చేరువలో అఖండ మూవీ

నందమూరి బాలకృష్ణ చాలా రోజులుగా సరైన విజయం కోసం వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 'అఖండ' ఆయనను హిట్ ట్రాక్ ఎక్కించడంతో పాటు ఇండస్ట్రీకి ఊపిరిపోసింది. ఇక, ఈ చిత్రం మొదటి వారంలో రూ. 53.49 కోట్లు వసూలు చేసింది. దీంతో రూ. 51 లక్షలు వస్తే హిట్ అవుతుంది. అలాగే, మరో రూ. 12 కోట్లు గ్రాస్ వస్తే వంద కోట్ల మార్కును చేరుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X