Akhanda 14days Collections: షాకిస్తోన్న అఖండ టోటల్ కలెక్షన్లు.. రెండు వారాల్లోనే అన్ని కోట్ల లాభాలు

తెలుగు సినీ ఇండస్ట్రీపై కరోనా వైరస్ చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. రెండేళ్లలో రెండు సార్లు లాక్‌డౌన్లు పెట్టడం వల్ల పరిశ్రమలో చాలా రకాలుగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అదే సమయంలో సెకెండ్ వేవ్ తర్వాత భారీ సక్సెస్‌లు మాత్రం దక్కనేలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా టాలీవుడ్ బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకునేలా చేసింది.

ఈ మూవీ ఆరంభం నుంచే కలెక్షన్లను కొల్లగొట్టింది. ఫలితంగా టార్గెట్‌ను చేరుకోవడంతో పాటు లాభాల బాటను కూడా పట్టేసింది. మరి ఈ మూవీ రెండు వారాల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

అఖండగా మారిపోయిన బాలకృష్ణ

అఖండగా మారిపోయిన బాలకృష్ణ

రెండు భారీ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన చిత్రమే 'అఖండ'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న భారీగా విడుదలైంది.

బాలయ్య కెరీర్‌లోనే రెండో స్థానంలో

బాలయ్య కెరీర్‌లోనే రెండో స్థానంలో

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా బాలకృష్ణకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్. ఈ మూవీ రేంజ్‌ను బట్టే దీన్ని ఎక్కువ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేశారు.

14వ రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

14వ రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

14వ రోజు అఖండకు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 45 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్ దక్కింది.

14 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

14 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

'అఖండ'కు 14 రోజుల్లో మాత్రం భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 18.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.97 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.66 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.80 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.13 కోట్లు, గుంటూరులో రూ. 4.40 కోట్లు, కృష్ణాలో రూ. 3.32 కోట్లు, నెల్లూరులో రూ. 2.40 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 54.93 కోట్లు షేర్, రూ. 90 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఏపీ, తెలంగాణలో సత్తా చాటిన 'అఖండ'.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో 2 వారాల్లో కలిపి రూ. 54.93 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.20 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 64.73 కోట్లు షేర్, రూ. 112 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా రెండు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 64.73 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 10.73 కోట్లు లాభాలను కూడా అందుకుంది.

మరో రికార్డును కొట్టేసిన బాలయ్య

మరో రికార్డును కొట్టేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమాకు రెండు వారాల్లో అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. దీంతో ఇప్పటికే రూ. 10.73 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది. దీంతో తక్కువ సమయంలోనే పది కోట్ల రూపాయల లాభాలను అందుకున్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే, ఈ ఏడాది ఎక్కవ లాభాలను అందుకున్న చిత్రాల జాబితాలో చేరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X