Akhanda 3 Weeks Collections: అన్ని కోట్ల లాభాలతో అఖండ అరాచకం.. ఆ ప్రాంతాల్లో మాత్రం నష్టాలు తప్పవా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొందరి కలయికలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలా ఫలానా దర్శకుడితో ఫలానా హీరో కలిసి పని చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో నటసింహా నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో ఒకటి. వీళ్లకు ప్రత్యేకమైన పేరు రావడానికి గతంలో ఇద్దరి కలయికలో వచ్చిన 'సింహా', 'లెజెండ్' వంటి చిత్రాలే కారణం. ఇవి భారీ విజయాలను అందుకోవడం వల్లే ఈ పేరు దక్కింది.

Recommended Video

Akhanda Success Tour : Nandamuri Balakrishna, Boyapati Srinu హల్చల్

చాలా కాలం తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేసిన చిత్రమే 'అఖండ'. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఆరంభం నుంచే కలెక్షన్లను కొల్లగొట్టింది.ఈ నేపథ్యంలో ఈ మూవీ మూడు వారాల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

 అఖండగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ

అఖండగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రమే 'అఖండ'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న గ్రాండ్‌గా విడుదలై భారీ హిట్‌ను సొంతం చేసుకుంది.

బాలయ్య కెరీర్‌లో రెండో అత్యధికం

బాలయ్య కెరీర్‌లో రెండో అత్యధికం

బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్ కావడం గమనార్హం. అందుకే దీన్ని భారీ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు.

21వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

21వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

మొదటి రోజు నుంచే 'అఖండ' మూవీకి భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అలా పది రోజుల పాటు ఏపీ తెలంగాణలో కలిపి కోటి రూపాయలకు పైగానే ఈ సినిమా వసూలు చేసింది. కానీ, అప్పటి నుంచి డ్రాప్ అయి 16వ రోజు నుంచి పుంజుకుంది. మళ్లీ తగ్గిపోయింది. దీంతో 21వ రోజైన బుధవారం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 21 లక్షలు మాత్రమే వచ్చాయి.

21 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

21 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

'అఖండ'కు 21 రోజులకు కలిపి భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 19.23 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.62 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.95 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.88 కోట్లు, గుంటూరులో రూ. 4.56 కోట్లు, కృష్ణాలో రూ. 3.46 కోట్లు, నెల్లూరులో రూ. 2.51 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 58.21 కోట్లు షేర్, రూ. 95.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఏపీ తెలంగాణలో సత్తా చాటిన 'అఖండ'.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. రెండు రాష్ట్రాల్లో 3 వారాల్లో కలిపి రూ. 58.21 కోట్లు అందుకున్న ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.62 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 68.68 కోట్లు షేర్, రూ. 120.80 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

ఎన్నో అంచనాలతో వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మూడు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 68.68 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 14.68 కోట్లు లాభాలను సొంతం చేసుకుంది.

 ఆ ప్రాంతాల్లో టార్గెట్ చేరుకోకుండా

ఆ ప్రాంతాల్లో టార్గెట్ చేరుకోకుండా

'అఖండ' విడుదలై 3 వారాలు పూర్తయ్యాయి. దీంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి. కానీ, ఉత్తరాంధ్ర (5 లక్షలు రావాలి), గుంటూరు (84 లక్షలు రావాలి), కృష్ణా (24 లక్షలు రావాలి) ప్రాంతాల్లో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను చేరుకోలేకపోయింది. అయితే, మిగిలిన ప్రాంతాలన్ని చోట్లా టార్గెట్‌ను చేరుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో కలెక్షన్లు రావడం కష్టమనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X