Akhanda 23 Days Collections: మళ్లీ పెరిగిన అఖండ కలెక్షన్లు.. అలా మరో రికార్డును కొట్టిన బాలయ్య

చాలా కాలంగా సరైన సక్సెస్ లేక తెగ ఇబ్బందులు పడుతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. అయినప్పటికీ ఆయన సినిమాలను మరింత వేగంగా చేస్తూనే ఉన్నారు. కానీ, విజయం మాత్రం ఆయనకు అందకుండానే వెళ్తూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు గతంలో రెండు భారీ విజయాలను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే సినిమాను చేశారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఆరంభం నుంచే కలెక్షన్లను కొల్లగొట్టింది. దీంతో తక్కువ సమయంలోనే టార్గెట్‌ను చేరుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ 23 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

అఖండగా అడుగు పెట్టిన బాలయ్య

అఖండగా అడుగు పెట్టిన బాలయ్య

నటసింహా బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రమే 'అఖండ'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న గ్రాండ్‌గా విడుదలై భారీ హిట్‌ను కొట్టేసిందీ మూవీ.

కెరీర్‌లో రెండో రికార్డు బిజినెస్ చేసి

కెరీర్‌లో రెండో రికార్డు బిజినెస్ చేసి

బాలకృష్ణకు ఏపీ తెలంగాణలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్ కావడం గమనార్హం. అందుకే దీన్ని భారీ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో తీసుకుని వచ్చారు.

23వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

23వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

తొలిరోజు నుంచే 'అఖండ' మూవీకి భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అలా పది రోజుల పాటు ఏపీ తెలంగాణలో కలిపి కోటి రూపాయలకు పైగానే ఈ సినిమా కలెక్షన్లను రాబట్టింది. కానీ, అప్పటి నుంచి డ్రాప్ అయి మధ్యలో మళ్లీ పుంజుకుంది. ఆ తర్వాత ప్రభావం కోల్పోయింది. కానీ, 23వ రోజు 4 లక్షలు పెంచుకుని తెలుగు రాష్ట్రాల్లో రూ. 19 లక్షలు షేర్‌ను సొంతం చేసుకుంది.

23 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

23 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

'అఖండ'కు 23 రోజులకు కలిపి భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 19.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.69 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.20 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.91 కోట్లు, గుంటూరులో రూ. 4.58 కోట్లు, కృష్ణాలో రూ. 3.48 కోట్లు, నెల్లూరులో రూ. 2.52 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 58.56 కోట్లు షేర్, రూ. 96.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఏపీ తెలంగాణలో హవా చూపిన 'అఖండ'.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. రెండు రాష్ట్రాల్లో 23 రోజుల్లో రూ. 58.56 కోట్లు అందుకున్న ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.87 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.63 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 69.06 కోట్లు షేర్, రూ. 121.50 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 23 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 69.06 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 15.06 కోట్లు లాభాలను సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X