Akhanda 24 Days Collections: మళ్లీ పెరిగిన అఖండ కలెక్షన్లు.. టికెట్ రేట్లు తక్కువున్నా అన్ని కోట్లు
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇన్నెళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలను అందుకున్న ఆయన.. కొంత కాలం పాటు వరుస ఫ్లాపులతో సతమతం అయ్యారు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ, విజయం మాత్రం ఆయనను వరించలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే సినిమాను చేశారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఆరంభం నుంచే కలెక్షన్లను కొల్లగొట్టింది. దీంతో తక్కువ సమయంలోనే టార్గెట్‌ను చేరుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ 24 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరూ చూడండి!

అఖండగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య
నటసింహా బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రమే 'అఖండ'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న గ్రాండ్‌గా విడుదలై భారీ హిట్‌ను సొంతం చేసుకుంది.

కెరీర్‌లో రెండో రికార్డు బిజినెస్ చేసి
ఏపీ తెలంగాణలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా బాలకృష్ణకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్ కావడం గమనార్హం. అందుకే దీన్ని భారీ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు.

24వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?
రిలీజ్ రోజు నుంచే 'అఖండ' మూవీకి భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అలా పది రోజుల పాటు ఏపీ తెలంగాణలో కలిపి కోటి రూపాయలకు పైగానే ఈ సినిమా కలెక్షన్లను రాబట్టింది. కానీ, అప్పటి నుంచి డ్రాప్ అయి మధ్యలో మళ్లీ పుంజుకుంది. ఆ తర్వాత ప్రభావం కోల్పోయింది. కానీ, 24వ రోజు భారీ రెస్పాన్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో రూ. 36 లక్షలు షేర్‌ను సొంతం చేసుకుంది.

24 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
24 రోజులకు కలిపి 'అఖండ'కు భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 19.48 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.79 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.02 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.04 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.95 కోట్లు, గుంటూరులో రూ. 4.60 కోట్లు, కృష్ణాలో రూ. 3.50 కోట్లు, నెల్లూరులో రూ. 2.54 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 58.92 కోట్లు షేర్, రూ. 97 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఏపీ తెలంగాణలో హవా చూపిన 'అఖండ'.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. రెండు రాష్ట్రాల్లో 24 రోజుల్లో రూ. 58.92 కోట్లు అందుకున్న ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.65 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 69.47 కోట్లు షేర్, రూ. 122.30 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?
ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 24 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 69.47 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 15.47 కోట్లు లాభాలను ఖాతాలో వేసుకుంది.


Click it and Unblock the Notifications











