Akhanda 25 Days Collections: ఒకే రోజు రెండు రికార్డులు కొట్టిన అఖండ.. 25 రోజుల్లోనే అన్ని కోట్లా!

తన వందవ చిత్రంగా వచ్చిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా సొంతం చేసుకోలేకపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అప్పటి నుంచి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే వచ్చాడు. కానీ, సక్సెస్ మాత్రం దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే సినిమాను చేశారు.

ఎన్నో అంచనాలు, ఆశలతో విడుదలైన ఈ మూవీ ఆరంభం పాజిటివ్ టాక్ నుంచే కలెక్షన్లను కొల్లగొట్టింది. దీంతో తక్కువ సమయంలోనే టార్గెట్‌ను చేరుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ 25 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

అఖండగా మారిపోయిన బాలయ్య

అఖండగా మారిపోయిన బాలయ్య

సింహా, లెజెండ్ వంటి హిట్ల తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన చిత్రమే 'అఖండ'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. థమన్ సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న రిలీజై భారీ విజయం సాధించింది.

బిజినెస్‌తోనూ బాలయ్య రికార్డులు

బిజినెస్‌తోనూ బాలయ్య రికార్డులు

బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్ కావడం గమనార్హం. అందుకే దీన్ని భారీ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు.

25వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

25వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?


'అఖండ' మూవీకి ఆరంభంలో భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అలా పది రోజుల పాటు ఏపీ తెలంగాణలో కలిపి కోటి రూపాయలకు పైగానే ఈ సినిమా కలెక్ట్ చేసింది. కానీ, అప్పటి నుంచి డ్రాప్ అయి మధ్యలో మళ్లీ పుంజుకుంది. మళ్లీ ఈ వీకెండ్ మళ్లీ రచ్చ చేసింది. దీంతో 25వ రోజైన ఆదివారం భారీ రెస్పాన్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో రూ. 47 లక్షలు షేర్‌ను సొంతం చేసుకుంది.

25 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

25 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

'అఖండ'కు 25 రోజులకు కలిపి భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 19.66 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.92 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.06 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.06 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.98 కోట్లు, గుంటూరులో రూ. 4.63 కోట్లు, కృష్ణాలో రూ. 3.52 కోట్లు, నెల్లూరులో రూ. 2.56 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 59.39 కోట్లు షేర్, రూ. 97.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

రెండు తెలుగు రాష్ట్రాల్లో హవా చూపిన 'అఖండ'.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఏపీ తెలంగాణలో 25 రోజుల్లో రూ. 59.39 కోట్లు అందుకున్న ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.96 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.67 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 70.02 కోట్లు షేర్, రూ. 123.20 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

హిట్ కాంబలో వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 25 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 70.02 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 16.02 కోట్లు లాభాలను అందుకుని సత్తా చాటిందీ సినిమా.

ఒకే రోజు అఖండ రెండు రికార్డులు

ఒకే రోజు అఖండ రెండు రికార్డులు

ఇప్పటికే 25 రోజులు పూర్తి చేసుకున్నా 'అఖండ' మూవీ బాక్సాఫీస్‌పై ఇంకా ప్రభావం చూపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే 25వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 70 కోట్ల షేర్ మార్కును దాటేసి రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు, లాభాల్లోనూ రూ. 16 కోట్ల మైలురాయిని చేరుకుంది. ఇలా ఒకే రోజు రెండు ఘనతలను అందుకుని బాలయ్య సినిమా రికార్డులు నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X