Akhanda 4 Weeks Collections: అఖండతో బాలయ్య రికార్డ్.. తెలుగులో 4వ స్థానం.. 28 రోజుల్లో అన్ని కోట్లు

ఎన్నో ఏళ్లుగా విజయ దాహంతో పరితపిస్తున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. దీంతో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ, ఆయనకు ఒక్క హిట్ కూడా అందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు బాగా అచ్చొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో జత కట్టాడు. ఇలా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రమే 'అఖండ'.

ఎన్నో అంచనాలు, ఆశలతో విడుదలైన ఈ మూవీ ఆరంభం నుంచే పాజిటివ్ టాక్‌ను అందుకుంది. దీంతో భారీ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టింది. ఫలితంగా తక్కువ సమయంలోనే టార్గెట్‌ను చేరుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నాలుగు వారాల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

అఖండగా ఎంటరైన నటసింహం

అఖండగా ఎంటరైన నటసింహం

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రమే 'అఖండ'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. థమన్ సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న విడుదలై భారీ హిట్‌ను సొంతం చేసుకుంది.

 బిజినెస్‌తోనూ బాలయ్య రికార్డులు

బిజినెస్‌తోనూ బాలయ్య రికార్డులు

ఏపీ తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా బాలకృష్ణకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్ కావడం గమనార్హం. అందుకే దీన్ని భారీ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో తీసుకొచ్చారు.

28వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

28వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

'అఖండ' మూవీకి ఆరంభంలో భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అలా పదకొండు రోజుల పాటు ఏపీ తెలంగాణలో కలిపి కోటి రూపాయలకు పైగానే వసూలు చేసింది. కానీ, అప్పటి నుంచి డ్రాప్ అయింది. మళ్లీ వీకెండ్ సమయంలో పుంజుకుంటూ.. తర్వాత తగ్గుతూ వస్తోంది. దీంతో 28వ రోజైన బుధవారం తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 10 లక్షలు షేర్‌ను సొంతం చేసుకుంది.

28 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

28 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

'అఖండ'కు 28 రోజులకు కలిపితే భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 19.87 కోట్లు, సీడెడ్‌లో రూ. 15.04 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.11 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.09 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.03 కోట్లు, గుంటూరులో రూ. 4.66 కోట్లు, కృష్ణాలో రూ. 3.55 కోట్లు, నెల్లూరులో రూ. 2.58 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 59.93 కోట్లు షేర్, రూ. 99 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హవా చూపిన 'అఖండ'.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో 4 వారాల్లో రూ. 59.93 కోట్లు అందుకున్న ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.68 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 70.61 కోట్లు షేర్, రూ. 124.45 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 4 వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 70.61 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 16.61 కోట్లు లాభాలను అందుకుని సత్తా చాటింది.

ఒకే రోజు అఖండ రెండు రికార్డులు

ఒకే రోజు అఖండ రెండు రికార్డులు

నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' మూవీ బాక్సాఫీస్‌పై ఇంకా ప్రభావం చూపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే నాలుగు వారాల్లోనే బిజినెస్‌ను బట్టి రూ. 17.61 కోట్ల లాభాలు అందుకుంది. ఫలితంగా ఈ ఏడాది ఎక్కువ లాభాలు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానానికి చేరింది. ఇందులో ఉప్పెన, జాతి రత్నాలు, క్రాక్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X