Akhanda 31 Days Collections: నెల దాటినా తగ్గని బాలయ్య హవా.. 31వ రోజు కూడా అన్ని లక్షలతో అరాచకం

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు మాత్రమే ప్రత్యేకమైన, విశేషమైన గుర్తింపు ఉంటుంది. ఫలానా దర్శకుడు, ఫలానా హీరో కలయికలో సినిమా వస్తే చూడాలని వాళ్ల వాళ్ల అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో నటసింహా నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను జోడీ ఒకటి. గతంలో 'సింహా', 'లెజెండ్' వంటి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన వీళ్లిద్దరూ.. ఇటీవలే 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా 31 రోజుల కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!

అఖండగా వచ్చేసిన నటసింహం

అఖండగా వచ్చేసిన నటసింహం

నటసింహా బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రమే 'అఖండ'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. థమన్ సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

కెరీర్‌లోనే రెండో భారీ బిజినెస్‌తో

కెరీర్‌లోనే రెండో భారీ బిజినెస్‌తో

బాలకృష్ణకు ఏపీ తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్ కావడం గమనార్హం. అందుకే దీన్ని భారీ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు.

31వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

31వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

బాలయ్య 'అఖండ' మూవీకి ఆరంభంలో భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అలా పదకొండు రోజుల పాటు ఏపీ తెలంగాణలో కలిపి కోటి రూపాయలకు పైగానే వసూలు చేసింది. కానీ, అప్పటి నుంచి డ్రాప్ అయింది. మళ్లీ వీకెండ్ సమయంలో పుంజుకుంటూ.. తర్వాత తగ్గుతూ వస్తోంది. ఇక, 31వ రోజైన శనివారం తెలుగు రాష్ట్రాల్లో భారీగా రూ. 60 లక్షలు షేర్‌ను సొంతం చేసుకుంది.

31 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

31 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

'అఖండ'కు 31 రోజులకు కలిపి కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 20.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 15.27 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.16 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.14 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.10 కోట్లు, గుంటూరులో రూ. 4.69 కోట్లు, కృష్ణాలో రూ. 3.58 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 60.74 కోట్లు షేర్, రూ. 101 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

రెండు తెలుగు రాష్ట్రాల్లో హవా చూపించిన 'అఖండ'.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఏపీ తెలంగాణలో 31 రోజుల్లో రూ. 60.74 కోట్లు అందుకున్న ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.01 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.68 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 71.43 కోట్లు షేర్, రూ. 125.60 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

సూపర్ హిట్ కాంబోలో వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 31 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 71.43 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 17.43 కోట్లు లాభాలను అందుకుని సత్తా చాటింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X