Akhanda 39 Days Collections: ఆరో వారంలోనూ కలెక్షన్స్ అదుర్స్.. బన్నీ, నాని మూవీలకు పోటీగా బాలయ్య

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కొన్ని కాంబినేషన్లు ప్రత్యేకమైనవిగా గుర్తింపు పొందాయి. అలాంటి వాటిలో టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయిక ఒకటి. దీనికి కారణం గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 'సింహా', 'లెజెండ్' వంటి సూపర్ డూపర్ హిట్లు రావడమే. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే వీళ్లు 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది.

అంతేకాదు, కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో సొంతం చేసుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కావడంతో పాటు లాభాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 39వ రోజు కలెక్షన్లపై లుక్కేద్దాం పదండి!

అఖండగా బాలకృష్ణ విశ్వరూపం

అఖండగా బాలకృష్ణ విశ్వరూపం

నటసింహా బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రమే ‘అఖండ'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. థమన్ సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది.

అఖండ బిజినెస్ జరిగింది ఇలా

అఖండ బిజినెస్ జరిగింది ఇలా

ఆంధ్రా, తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా బాలకృష్ణకు మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో ‘అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్ కావడం గమనార్హం. అందుకే దీన్ని భారీ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు.

39వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

39వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న బాలయ్య నటించిన ‘అఖండ' మూవీకి ఆరంభంలో భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అలా పదకొండు రోజుల పాటు ఏపీ తెలంగాణలో కలిపి కోటి రూపాయలకు పైగానే వసూలు చేసింది. కానీ, అప్పటి నుంచి డ్రాప్ అయింది. మళ్లీ వీకెండ్ సమయంలో పుంజుకుంటోంది. ఇక, 39వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇది రూ. 11 లక్షలు రాబట్టింది.

39 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

39 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

‘అఖండ'కు 39 రోజులకు కలిపి కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 20.64 కోట్లు, సీడెడ్‌లో రూ. 15.63 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.25 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.20 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.18 కోట్లు, గుంటూరులో రూ. 4.74 కోట్లు, కృష్ణాలో రూ. 3.63 కోట్లు, నెల్లూరులో రూ. 2.62 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 61.89 కోట్లు షేర్, రూ. 102.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఏపీ తెలంగాణలో హవా చూపించిన ‘అఖండ' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 39 రోజుల్లో రూ. 61.89 కోట్లు అందుకున్న ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.04 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.70 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 72.63 కోట్లు షేర్, రూ. 127.75 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

సూపర్ హిట్ కాంబోలో వచ్చిన ‘అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 39 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 72.63 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 18.63 కోట్లు లాభాలను అందుకుని సత్తా చాటింది.

Recommended Video

2021 Year Ender : Top 5 Telugu Movies Released In 2021 | Filmibeat Telugu
బన్నీ, నాని సినిమాలకు గట్టి పోటీ

బన్నీ, నాని సినిమాలకు గట్టి పోటీ


‘అఖండ' విడుదలై 39 రోజులు పూర్తయ్యాయి. అయినా ఇది మంచి కలెక్షన్లనే రాబడుతోంది. మరీ ముఖ్యంగా ఆదివారం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11 లక్షలు వసూలు చేసింది. అలాగే, అల్లు అర్జున్ ‘పుష్ప' రూ. 19 లక్షలు, నాని ‘శ్యామ్ సింగ రాయ్' రూ. 15 లక్షలు కలెక్ట్ చేశాయి. అంటే ‘అఖండ' మూవీ ఆరో వారంలోనూ వీటికి గట్టి పోటీని ఇస్తుందని అర్థం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X