India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Akhanda 45 Days Collections: సంక్రాంతి సినిమాలకు అఖండ దెబ్బ.. బాలయ్య ఖాతాలో కళ్లు చెదిరే రికార్డు

  |

  'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చాలా కాలం పాటు ఎదురు చూశారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ క్రమంలోనే ఆయన వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేశారు. కానీ, అవి మాత్రం సరైన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో గతంలో తనకు రెండు భారీ సక్సెస్‌లను అందించిన బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే సినిమాను చేశారు.

  భారీ అంచనాల మధ్యన గత నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభంలోనే దీనికి మంచి టాక్ రావడంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఇది చాలా తక్కువ టైంలోనే టార్గెట్‌ను చేరుకుంది. అలా ఎనిమిది వారాలుగా సత్తా చాటుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా 45వ రోజు కలెక్షన్లపై లుక్కేద్దాం పదండి!

  ‘అఖండ'గా బాలకృష్ణ అరాచకం

  ‘అఖండ'గా బాలకృష్ణ అరాచకం

  సింహా, లెజెండ్ తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన చిత్రమే 'అఖండ'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. థమన్ సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

  బిడ్డకు పాలు పడుతోన్న ఫొటోను షేర్ చేసిన శ్రీయ: ఇలాంటివి కూడా వదులుతారా అంటూ దారుణంగా!

  అఖండ ప్రీ బిజినెస్ జరిగిందిలా

  అఖండ ప్రీ బిజినెస్ జరిగిందిలా

  బాలకృష్ణకు ఆంధ్రా, తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్. అందుకే దీన్ని భారీ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

  45వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

  45వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

  హిట్ కోసం తహతహలాడుతోన్న బాలయ్య నటించిన 'అఖండ' మూవీకి ఆరంభంలో భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అలా పదకొండు రోజుల పాటు ఏపీ తెలంగాణలో కలిపి కోటి రూపాయలకు పైగానే వసూలు చేసింది. కానీ, అప్పటి నుంచి డ్రాప్ అయింది. కానీ, సంక్రాంతి రోజు భారీగా పుంజుకుంది. దీంతో 45వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇది రూ. 18 లక్షలు రాబట్టింది.

  పూర్తి నగ్నంగా ఉన్న ఫొటో షేర్ చేసిన హీరోయిన్: ఒక్కసారిగా బెడ్ మీద అలా కనిపించడంతో!

  45 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

  45 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

  45 రోజులకు కలిపి 'అఖండ'కు కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 20.81 కోట్లు, సీడెడ్‌లో రూ. 15.76 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.30 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.21 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.23 కోట్లు, గుంటూరులో రూ. 4.76 కోట్లు, కృష్ణాలో రూ. 3.65 కోట్లు, నెల్లూరులో రూ. 2.63 కోట్లతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 62.35 కోట్లు షేర్, రూ. 103.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

  ఆంధ్రా తెలంగాణలో హవా చూపించిన 'అఖండ' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 45 రోజుల్లో రూ. 62.39 కోట్లు అందుకున్న ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.70 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 73.10 కోట్లు షేర్, రూ. 128.62 కోట్లు గ్రాస్‌ వచ్చింది.

  ప్రియుడితో శృతి హాసన్ రచ్చ: ఎదపై హత్తుకుని ఘాటుగా.. పిచ్చ హాట్ ఫొటోను షేర్ చేసిన హీరోయిన్

  బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

  బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

  క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 45 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 73.10 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 19.10 కోట్లు లాభాలను అందుకుని సత్తా చాటింది.

  సంక్రాంతి సినిమాలకు అఖండ షాక్

  సంక్రాంతి సినిమాలకు అఖండ షాక్

  'అఖండ' విడుదలై 45 రోజులు పూర్తయ్యాయి. అయినా ఇది మంచి కలెక్షన్లనే రాబడుతోంది. మరీ ముఖ్యంగా సంక్రాంతి రోజు ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో ఇది రికార్డు క్రియేట్ చేసింది. మ్యాట్నీ షోకు ఈ చిత్రానికి రూ. 68 వేలకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక, దీని తర్వాత హీరోకు రూ. 66 వేలు బంగార్రాజుకు రూ. 65 వేలు, రౌడీ బాయ్స్‌కు రూ. 50 వేలు, పుష్పకు రూ. 19 వేలు వచ్చాయి.

  English summary
  Nandamuri Balakrishna Did Akhanda Movie Under Boyapati Srinu Direction. This Movie Collect Rs 73.10 Crores in 45 Days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X