For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Akhanda 50 Days Collections: యాభై రోజుల్లోనే అన్ని కోట్లు.. బాలయ్య కెరీర్‌లోనే మరో గొప్ప రికార్డు

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి. అందులో నటసింహా నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయిక ఒకటి. గతంలో వీళ్లిద్దరూ కలిసి చేసిన 'సింహా', 'లెజెండ్' వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. దీంతో వీళ్ల కాంబోలో మూడో సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే గత డిసెంబర్‌లో 'అఖండ' అనే సినిమాతో వీళ్లు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

  ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు రెస్పాన్స్ కూడా అదిరిపోయే రీతిలో వచ్చింది. దీంతో సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు, ఏకంగా యాభై రోజుల పాటు ప్రదర్శితం అయింది. ఈ నేపథ్యంలో 'అఖండ' 50 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

  అఖండమైన హిట్ కొట్టిన బాలకృష్ణ

  అఖండమైన హిట్ కొట్టిన బాలకృష్ణ

  నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తీసిన చిత్రమే 'అఖండ'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న విడుదలై అఖండమైన విజయాన్ని అందుకుంది.

  దారుణమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

  అఖండ థియేట్రికల్ బిజినెస్ ఇలా

  అఖండ థియేట్రికల్ బిజినెస్ ఇలా

  నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేశారు.

  50వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

  50వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

  క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సత్తా చాటింది. అలా యాభై రోజుల పాటు ఇది హవాను చూపించింది. ఈ క్రమంలోనే 50వ రోజైన గురువారం ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 9 లక్షలు వసూలు చేసి ఔరా అనిపించింది.

  ముక్కు అవినాష్‌కు షాకిచ్చిన ఛానెల్: జబర్ధస్త్ మానేసి వస్తే.. వీళ్లు కూడా పక్కన పెట్టేశారంటూ!

  50 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

  50 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

  50 రోజులకు కలిపి 'అఖండ'కు కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 21.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 15.90 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.34 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.22 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.28 కోట్లు, గుంటూరులో రూ. 4.81 కోట్లు, కృష్ణాలో రూ. 3.67 కోట్లు, నెల్లూరులో రూ. 2.64 కోట్లతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 62.87 కోట్లు షేర్, రూ. 104.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

  ఏపీ, తెలంగాణలో హవా చూపించిన 'అఖండ' మూవీ.. తెలుగు రాష్ట్రాల్లో 50 రోజుల్లో రూ. 62.87 కోట్లు అందుకున్న ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.71 కోట్లు రాబట్టింది. అలాగే, మరికొన్ని చోట్ల రూ. 85 లక్షలు కలెక్ట్ చేసింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 74.58 కోట్లు షేర్, రూ. 132 కోట్లు గ్రాస్ వసూలు చేసేసింది.

  నా బాడీలో అవి అంటేనే ఇష్టం: నెటిజన్ వింత ప్రశ్నకు శృతి హాసన్ ఊహించని జవాబు

  బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

  బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

  బాలయ్య కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 50 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 74.58 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా రూ. 20.58 కోట్లు లాభాలతో రికార్డును అందుకుంది.

  రికార్డులతో దండయాత్ర చేసిన హీరో

  రికార్డులతో దండయాత్ర చేసిన హీరో

  'అఖండ' విడుదలై 50 రోజులు పూర్తయ్యాయి. అయినా ఇది మంచి కలెక్షన్లనే రాబడుతూ వచ్చింది. 103 కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. రూ. 20 కోట్ల లాభాల మార్కును కూడా చేరుకుంది. దీంతో బాలయ్య పలు రికార్డులను అందుకున్నారు. అంతేకాదు, థియేట్రికల్, నాన్ థియేట్రికల్ వసూళ్లలో రూ. 200 కోట్ల గ్రాస్‌ను దాటేసి కెరీర్‌లోనే గొప్ప రికార్డు కొట్టారు.

  English summary
  Nandamuri Balakrishna Did Akhanda Movie Under Boyapati Srinu Direction. This Movie Collect Rs 74.58 Crores in 50 Days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion