Akhanda Day 3 Collections: టాలీవుడ్‌లో నెంబర్ వన్ మూవీగా అఖండ.. 3 రోజుల్లోనే అన్ని కోట్లతో రికార్డ్

కొన్నేళ్లుగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నా.. విజయాన్ని అందుకోలేక ఇబ్బందులు పడుతున్నారు బడా హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. అప్పటి నుంచి ఆయన వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ సక్సెస్‌ మాత్రం సొంతం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో ఉన్నారు.

Recommended Video

Akhanda Collections : Balayya Gets Career Best Numbers || Filmibeat Telugu

ఈ నేపథ్యంలోనే 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ హిట్ల తర్వాత బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే చిత్రాన్ని చేశారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ మూవీ మూడు రోజుల కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉన్నాయో చూద్దాం పదండి!

‘అఖండ'గా వచ్చేసిన నటసింహం

‘అఖండ'గా వచ్చేసిన నటసింహం

నటసింహా నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న విడుదల అయింది.

ఆయన కెరీర్‌లో రెండో భారీ బిజినెస్‌

ఆయన కెరీర్‌లో రెండో భారీ బిజినెస్‌

నందమూరి బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ స్థాయిలో విడుదల చేశారు.

మూడో రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

మూడో రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

అఖండకు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజూ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.51 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.78 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 82 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 53 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 32 లక్షలు, గుంటూరులో రూ. 43 లక్షలు, కృష్ణాలో రూ. 41 లక్షలు, నెల్లూరులో రూ. 23 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 7.03 కోట్లు షేర్, రూ. 11.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూడు రోజులకు కలిపి ఎంతొచ్చింది

మూడు రోజులకు కలిపి ఎంతొచ్చింది

బాలయ్య సినిమాకు మూడు రోజులకు కలిపి భారీ మొత్తాలు వచ్చాయి. నైజాంలో రూ. 9.16 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.78 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.87 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.40 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.62 కోట్లు, గుంటూరులో రూ. 2.71 కోట్లు, కృష్ణాలో రూ. 1.66 కోట్లు, నెల్లూరులో రూ. 1.41 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 29.25 కోట్లు షేర్, రూ. 44.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ను అందుకున్న 'అఖండ'.. మిగిలిన ప్రాంతాల్లోనూ రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో మూడు రోజులకు రూ. 29.25 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.55 కోట్లు రాబట్టింది. ఫలితంగా రూ. 35.40 కోట్లు షేర్, రూ. 56.90 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలి

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలి

ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 35.40 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 18.60 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌లోకి వెళ్తుంది.

ఓవర్సీస్‌లో టార్గెట్ పూర్తి చేసేశాడు

ఓవర్సీస్‌లో టార్గెట్ పూర్తి చేసేశాడు

నందమూరి బాలకృష్ణకు ఓవర్సీస్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే 'అఖండ' మూవీకి అక్కడ కూడా భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటి వరకూ ఈ చిత్రం అక్కడ అదిరిపోయే కలెక్షన్లను అందుకుంది. దీంతో కేవలం మూడు రోజుల్లోనే 700K డాలర్లను వసూలు చేసి సత్తా చాటింది. ఫలితంగా అప్పుడే బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను కూడా దాటేసి రికార్డులు క్రియేట్ చేసింది.

టాలీవుడ్‌లో నెంబర్ వన్‌గా అఖండ

టాలీవుడ్‌లో నెంబర్ వన్‌గా అఖండ

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'అఖండ' మూవీకి ప్రేక్షకులు ఊహించని దాని కంటే ఎక్కువ స్పందననే అందిస్తున్నారు. దీంతో బాలయ్య చిత్రం బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తోంది. ఫలితంగా మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 35.40 కోట్లు వసూలు చేసింది. తద్వారా సెకెండ్ వేవ్ తర్వాత ఎక్కువ షేర్ రాబట్టిన సినిమాగా రికార్డులకెక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X