Akhanda Day 4 Collections: వకీల్ సాబ్‌ను దాటేసిన అఖండ.. బాలయ్య ఊచకోతతో అన్ని కోట్ల టార్గెట్ ఉఫ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు మాత్రమే విశేషమైన గుర్తింపు ఉంది. అందులో ఓ డైరెక్టర్.. ఓ హీరో ఇలా చూసుకుంటే చాలా కాంబినేషన్లు టాలీవుడ్‌పై సత్తా చాటాయి. అలాంటి కలయికల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను జోడీ ఒకటి. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'సింహా', 'లెజెండ్' చిత్రాలు ఒకదానికి మించి ఒకటి హిట్ అయ్యాయి. అదే సమయంలో సెన్సేషన్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి చేసిన మూడో చిత్రమే 'అఖండ'.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. మరి ఈ మూవీ నాలుగు రోజుల్లో ఎంత కలెక్షన్లు చేసిందో చూద్దాం పదండి!

 ‘అఖండ'గా మారిపోయిన నటసింహా

‘అఖండ'గా మారిపోయిన నటసింహా

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రమే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

అత్యధిక స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్

అత్యధిక స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్

నటసింహా బాలకృష్ణకు మన రెండు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేశారు.

నాలుగో రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

నాలుగో రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

అఖండకు తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు మరింత రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.03 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 87 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 57 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, గుంటూరులో రూ. 55 లక్షలు, కృష్ణాలో రూ. 62 లక్షలు, నెల్లూరులో రూ. 30 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 8.31 కోట్లు షేర్, రూ. 13.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

నాలుగు రోజులకు కలిపి ఎంతొచ్చింది

నాలుగు రోజులకు కలిపి ఎంతొచ్చింది

'అఖండ' మూవీకి నాలుగు రోజులకు కలిపి భారీ వసూళ్లు వచ్చాయి. నైజాంలో రూ. 12.11 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.81 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.74 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.61 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.04 కోట్లు, గుంటూరులో రూ. 3.26 కోట్లు, కృష్ణాలో రూ. 2.28 కోట్లు, నెల్లూరులో రూ. 1.71 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 37.56 కోట్లు షేర్, రూ. 59.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంతంటే

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంతంటే

తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు క్రియేట్ చేసిన 'అఖండ'.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో నాలుగు రోజులకు రూ. 37.56 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.05 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 44.86 కోట్లు షేర్, రూ. 73.60 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలి?

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 44.86 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 9.14 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

వకీల్ సాబ్‌ను దాటిన బాలయ్య మూవీ

వకీల్ సాబ్‌ను దాటిన బాలయ్య మూవీ

బాలయ్యకు మిగిలిన ప్రాంతాల్లో మాదిరిగానే ఓవర్సీస్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే 'అఖండ'కు అక్కడ భారీ స్పందన వస్తోంది. ఇప్పటి వరకూ ఈ చిత్రం అక్కడ ఓ రేంజ్‌లో కలెక్షన్లను అందుకుంది. దీంతో కేవలం నాలుగు రోజుల్లోనే 800K డాలర్లను వసూలు చేసింది. ఫలితంగా వకీల్ సాబ్ (743K) దాటింది. అలాగే, బ్రేక్ ఈవెన్‌ను కూడా మూడో రోజే దాటేసింది.

Recommended Video

SkyLab Movie Review || Filmibeat Telugu
నాలుగో రోజు ఎన్నో రికార్డులు సొంతం

నాలుగో రోజు ఎన్నో రికార్డులు సొంతం

ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'అఖండ' మూవీ నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.31 కోట్లు రాబట్టింది. దీంతో 4వ రోజు ఎక్కువ వసూలు చేసిన (నాన్ బాహుబలి) ఐదో చిత్రంగా నిలిచింది. దీనికి ముందు 'అల.. వైకుంఠపురములో', 'సాహో', 'సరిలేరు నీకెవ్వరు', 'మహర్షి' ఉన్నాయి. అలాగే, 'అఖండ' మూవీ నైజాంలో రూ. 12.11 కోట్లు వసూలు చేసి బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ (10.5 కోట్లు)ను పూర్తి చేసేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X