ఫుల్ స్వింగ్ లో ఉన్న బాలయ్య అఖండ బిజినెస్.. కర్ణాటకలో భారీ ఆఫర్.. ఉత్తరాంధ్రలో కూడా బిగ్గెస్ట్ డీల్

టాలీవుడ్ ఇండస్ట్రీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అఖండ సినిమా టాప్ లిస్టులో ఉంది అని చెప్పవచ్చు. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు బోయపాటి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తరాంధ్ర, కర్ణాటకలో కూడా భారీ ధరకు సినిమా అమ్ముడైనట్లు సమాచారం.

మొదటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్

మొదటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్

నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో ఇదివరకే రెండు సినిమాలు వచ్చాయి. సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బాలకృష్ణ గత 15 ఏళ్లలో అలాంటి సక్సెస్ ను మళ్లీ చూడలేదు. ఇక బాలకృష్ణ నుంచి గత కొన్నేళ్ల నుంచి వచ్చిన సినిమాలు కూడా ఏదో ఒక విధంగా డివైడ్ టాక్ ను ఆదుకుంటుంది. కానీ బోయపాటి దర్శకత్వంలో సినిమా అనగానే మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి.

హ్యాట్రిక్ పక్కా..

హ్యాట్రిక్ పక్కా..

నందమూరి బాలకృష్ణ గత కొంతకాలంగా వరుస అపజయాలను చూస్తున్న విషయం తెలిసిందే. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను కూడా వినయ విధేయ రామ సినిమా తో భారీ డిజాస్టర్ ను సొంతం చేసుకున్నాడు. అందుకే అఖండ సినిమాతో బాలయ్య కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు స్థాయిని ఒక్కసారిగా పెంచేసింది. సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అయ్యింది.

కర్ణాటకలో బిగ్ డీల్

కర్ణాటకలో బిగ్ డీల్

ఇక మొన్నటివరకు ఒక తరహా లో ఉన్న బిజినెస్ లెక్కలు ఇప్పుడు ఒక్కసారిగా పెరుగుతున్న అంచనాలకు మారి పోయాయని తెలుస్తోంది. కర్ణాటకలో బాలకృష్ణకు మంచి మార్కెట్ అయితే ఉంది. చాలా వరకు కమర్షియల్ సినిమాల్లో అయితే బ్రేక్ ఈవెన్ ను కూడా అందుకున్నాయి. ఇప్పుడు ఆ ఏరియాలో అఖండ సినిమా రిలీజ్ హక్కులు 5కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.

ఉత్తరాంధ్ర డీల్ క్లోజ్

ఉత్తరాంధ్ర డీల్ క్లోజ్

ఉత్తరాంధ్రలో కూడా సినిమా కు మంచి మార్కెట్ అయితే ఉంది. బోయపాటి కొత్త సినిమాలు అన్నీ కూడా ఈ ఏరియాలో ఫ్లాప్ టాక్ అందుకున్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు అందుకున్నాయి. మొదటి వారంలోనే బాలకృష్ణ కూడా ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఉత్తరాంధ్రలో దాదాపు 6.5కోట్ల ధర పలికినట్లు సమాచారం. ఇక మిగతా ఏరియాల్లో బిజినెస్ డీల్స్ అయితే క్లోజ్ కావాల్సి ఉంది.

Recommended Video

అసెంబ్లీ ప్రజా సమస్యలను చర్చించడానికి అకారణంగా దూషించడానికి కాదు - Kalyan Ram || Filmibeat Telugu
సెన్సార్ పనులు పూర్తి..

సెన్సార్ పనులు పూర్తి..

ఇక అఖండ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నద్ధమవుతుంది. అసలైతే దసరా సమయంలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితుల ప్రభావం వలన నిర్మాతలు ధైర్యం చేయలేకపోయారు. ఇక ఫైనల్ గా నేడు సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా ఫినిష్ అయ్యాయి. యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా 167 నిమిషాల నిడివితో ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X