Daaku Maharaaj Closing Collections: డాకు మహారాజ్ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్.. లాభమెంత? నష్టమెంత?
Daaku Maharaaj Closing Collections: ప్రస్తుతం నటసింహ నందమూరి బాలకృష్ణ టైమ్ నడుస్తుంది. ఏడుపదుల వయసుకు చేరువలో ఉన్నా.. బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన 'డాకు మహారాజ్' కూడా పాజిటివ్ టాక్ అందుకోవడంతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. దీంతో మరో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. సీనియర్ హీరోల్లో వరుస విజయాలు అందుకున్న ఘనత బాలయ్యకే దక్కింది. ఇప్పటికే బ్రేక్-ఈవెన్ గ్రాస్ చేసిన డాకు మహారాజ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. లాభమెంత? నష్టమెంత? అనే వివరాల్లోకెళ్తే..
సక్సెస్ పుల్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'డాకు మహారాజ్' సినిమాలో నందమూరి బాలకృష్ణ (Balakrishna), ప్రగ్యా జైష్వాల్ (Pragya Jaiswal), చాందినీ చౌదరి(Chandini choudhury), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) , ఊర్వశి రోతేల (Urvashi Rautela) ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి ఎస్ తమన్ మ్యూజిక్ అందించగా.. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ గా నటించగా.. ఊర్వశి రౌటెలా ఓ స్పెషల్ క్యారెక్టర్ లో నటించడమే కాకుండా ఐటమ్ సాంగ్‌లో మాస్ అండ్ గ్లామర్ స్టెప్పులేసింది.

హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బాలకృష్ణ, సక్సెస్ పుల్ డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కిన 'డాకు మహారాజ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అనుకున్నదాని కంటే భారీ స్థాయిలో జరిగింది. 'డాకు మహారాజ్'పై దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాకు 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 82 కోట్లుగా నిర్ణయించాయి ట్రేడ్ వర్గాలు. ఇక డాకు మహారాజ్ ను గ్రాండ్ గా 1600 స్క్రీన్లలో విడుదల చేశారు. ఇక బాలయ్య తన సినీ కెరీర్ లోనే హైయ్యేస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా 'డాకు మహారాజ్' రికార్డు క్రియేట్ చేసింది.
డాకు మహారాజ్ అంటే.. సంక్రాంతి + బాలయ్య మాస్ యాక్షన్స్ డెడ్లీ కాంబో. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుస విజయాలతో జోష్ లో ఉన్న బాలకృష్ణ.. డాకు మహారాజ్ తో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశారు. మరోవైపు.. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వ వహించిన సినిమా ఇది. ఇక డాకు మహారాజ్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి వారంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 66.4 కోట్లు కలెక్ట్ చేయగా.. రెండో వారంలో రూ. 17.5 కోట్లు, మూడో వారం రూ. 5.7 కోట్లు కలెక్ట్ చేయగలిగింది. ఇక ప్రాంతాల వారిగా చూస్తే.. ఏపీ,తెలంగాణలో రూ 78.5 కోట్లు అందుకోగా, నార్డ్ లో రూ. 7.20 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 9.6 కోట్లు అందుకుంది. ఇలా అన్ని సెంటర్ ల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది.
అయితే.. మూవీ మేకర్స్ మాత్రం.. బాలకృష్ణ డాకు మహారాజ్ రూ.82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.165 కోట్లు అందుకుందంటూ ప్రకటించారు. ఈ లెక్కలలో కాస్త సందిగ్ధం నెలకొన్న డాకు మహారాజ్ మాత్రం కలెక్షన్ల పరంగా విజయం సాధించిందని చెప్పాలి. మొత్తానికి నందమూరి బాలకృష్ణ వరుసగా నాలుగు విజయాలు సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఇక బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో డాకు మాహారాజ్ స్థానం దక్కించుకుంది. మొత్తానికి లాభాల బాటలో నడుస్తోంది డాకు మహారాజ్.
ఇక డాకు మహారాజ్ ఓటీటీలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications











