Don't Miss!
- Sports
రియాన్ పరాగ్ ఫీల్డింగ్ మస్తుందిగా.. అతని జోష్ అదిరిపోయిందన్న శ్రీలంకన్ స్టార్
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- News
ఆధార్ కార్డ్ జిరాక్స్‌లను అందరితో పంచుకోవద్దు: ‘మాస్క్డ్ ఆధార్’పై కేంద్రం తాజా ఉత్తర్వలు
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Akhanda 53 days collections బాలయ్య జోరును ఆపేది ఎవరు? ఓటీటీలో రచ్చ చేస్తూనే..
టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన అఖండ బాక్సాఫీస్ జోరును ఆపేతరం కనిపించడం లేదు. ఓ పక్క థియేటటర్లలో 50 రోజులు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీ యాప్‌లో రికార్డు స్థాయి వ్యూవర్షిప్ను సాధించింది. 24 గంటల్లోనే ఈ చిత్రం 1 మిలియన్ మంది చూడటం దేశవ్యాప్తంగా ఓటీటీలో రికార్డుగా నమోదైంది. ఇలా ప్రతీ ఫ్లాట్‌ఫామ్ మీద దూసుకెళ్తున్న ఈ చిత్రం 53వ రోజున కూడా కూడా మంచి వసూళ్లను సాధించడం విశేషంగా చెప్పుకొంటున్నారు.
తెలుగు రాష్టాల్లో అఖండ చిత్రాన్ని ప్రేక్షకుల ఇంకా ఆదరిస్తూనే ఉన్నారని చెప్పడానికి 53వ రోజున వసూలు చేసిన కలెక్షన్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 53వ రోజున నైజాం, ఆంధ్రాలో కలిపి 7 కోట్లు షేర్ సాధించింది. ఇక 53 రోజుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా బాలకృష్ణ సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో అఖండ చిత్రం 63.03 కోట్ల షేర్, 104.08 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 74.79 కోట్ల షేర్, 132.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.
అఖండ చిత్రం రిలీజ్‌కు ముందు, తర్వాత అన్నీ ప్రతికూలతలే ఉన్నాయి. ఏపీలో టికెట్ల రేట్ల తగ్గింపు, కరోనావైరస్ కేసుల పెరుగుదల లాంటి అంశాలను ఎదురించి రికార్డు వసూళ్లను సాధించింది.
ఇక అఖండ చిత్రం మరో రికార్డును కూడా సొంతం చేసుకొన్నది. సినీ రాజధానిగా పేర్కొనే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఏకంగా కోటి రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకొన్నది.