Akhanda 16days Collections: పుష్ప ఉన్నా తగ్గని అఖండ.. 16 రోజుల్లోనే అన్ని కోట్ల లాభాలతో సత్తా
కొంత కాలంగా వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు చవి చూస్తూ తెగ ఇబ్బందులు పడుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనతో పాటు అభిమానులు కూడా నిరాశకు లోనయ్యారు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను అందుకోవాలని ఈ సీనియర్ హీరో పట్టుదలగా కనిపించారు. ఈ నేపథ్యంలోనే గతంలో తనకు రెండు భారీ విజయాలను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' మూవీ చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఆరంభం నుంచే కలెక్షన్లను కొల్లగొట్టింది. ఫలితంగా టార్గెట్‌ను చేరుకోవడంతో పాటు లాభాల బాటను కూడా పట్టేసింది. మరి ఈ మూవీ 16 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

అఖండగా ఎంట్రీ ఇచ్చిన నటసింహా
సింహా, లెజెండ్ తర్వాత నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన చిత్రమే 'అఖండ'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

బాలకృష్ణ కెరీర్‌లో రెండవ అత్యధికం2
బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్. ఈ మూవీ రేంజ్‌ను బట్టే దీన్ని ఎక్కువ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

16వ రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?
ఆరంభం నుంచీ 'అఖండ' మూవీకి భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. దాదాపు పది రోజుల పాటు తెలుగ రాష్ట్రాల్లో కోటి రూపాయలక పైగానే ఈ సినిమా వసూలు చేస్తూ వచ్చింది. కానీ, అప్పటి నుంచి క్రమంగా డ్రాప్ అవుతోంది. ఈ క్రమంలోనే 16వ రోజు పుష్ప రిలీజ్ అయినా అఖండ మూవీ బాగానే హోల్డ్ చేసుకుంది. దీంతో కేవలం రూ. 29 లక్షలు షేర్‌ను మాత్రమే రాబట్టింది.

16 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
'అఖండ'కు 16 రోజుల్లో చాలా మంచి కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 18.46 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.73 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.84 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.19 కోట్లు, గుంటూరులో రూ. 4.44 కోట్లు, కృష్ణాలో రూ. 3.36 కోట్లు, నెల్లూరులో రూ. 2.42 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 55.54 కోట్లు షేర్, రూ. 90.96 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటిన 'అఖండ'.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో 16 రోజులకు కలిపి రూ. 55.54 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.64 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.25 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 65.43 కోట్లు షేర్, రూ. 113.15 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?
భారీ అంచనాలతో వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 16 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 65.43 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 11.43 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











