Akhanda 5 Weeks Collections: ఐదు వారాల్లోనే అన్ని కోట్ల లాభాలు.. రెండు చోట్ల మాత్రం అఖండకు నష్టాలే

కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆయన ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా ప్రాజెక్టులను చేస్తూ వస్తున్నారు. అయినా ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న పట్టుదలతో.. గతంలో 'సింహా', 'లెజెండ్' వంటి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీనుతో 'అఖండ' అనే సినిమాను చేశారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ఐదు వారాల కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!

 అఖండగా గర్జించిన నటసింహం

అఖండగా గర్జించిన నటసింహం

నటసింహా బాలకృష్ణ - బోయపాటి శ్రీను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రమే ‘అఖండ'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. థమన్ సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందుకుంది.

అఖండ సినిమా బిజినెస్ డీటేల్స్

అఖండ సినిమా బిజినెస్ డీటేల్స్

ఏపీ తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా బాలకృష్ణకు మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో ‘అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్ కావడం గమనార్హం. అందుకే దీన్ని భారీ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

35వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

35వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

బాలయ్య నటించిన ‘అఖండ' మూవీకి ఆరంభంలో భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అలా పదకొండు రోజుల పాటు ఏపీ తెలంగాణలో కలిపి కోటి రూపాయలకు పైగానే వసూలు చేసింది. కానీ, అప్పటి నుంచి డ్రాప్ అయింది. మళ్లీ వీకెండ్ సమయంలో పుంజుకుంటూ.. తర్వాత తగ్గుతూ వస్తోంది. ఇక, 35వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 9 లక్షలు షేర్‌ను సొంతం చేసుకుంది.

35 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

35 రోజులకు కలిపి ఎంత వచ్చింది?


‘అఖండ'కు ఐదు వారాలకు కలిపి కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 20.54 కోట్లు, సీడెడ్‌లో రూ. 15.53 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.21 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.19 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.15 కోట్లు, గుంటూరులో రూ. 4.73 కోట్లు, కృష్ణాలో రూ. 3.61 కోట్లు, నెల్లూరులో రూ. 2.61 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 61.57 కోట్లు షేర్, రూ. 102.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

తెలుగు రాష్ట్రాల్లో హవా చూపించిన ‘అఖండ' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఏపీ తెలంగాణలో 35 రోజుల్లో రూ. 61.57 కోట్లు అందుకున్న ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.02 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.68 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 72.27 కోట్లు షేర్, రూ. 127.10 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 5 వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 72.27 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 18.27 కోట్లు లాభాలను అందుకుని సత్తా చాటింది.

Recommended Video

Akhanda Collections : Balayya Gets Career Best Numbers || Filmibeat Telugu
 ఆ రెండు ప్రాంతాల్లో మాత్రం నష్టాలే

ఆ రెండు ప్రాంతాల్లో మాత్రం నష్టాలే

‘అఖండ' విడుదలై 5 వారాలు పూర్తయ్యాయి. దీంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి. అంతేకాదు, అన్ని ఏరియాల్లోనూ దాదాపుగా టార్గెట్‌ను పూర్తి చేసుకుంది. కానీ, గుంటూరులో బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌కు ఇంకా రూ. 67 లక్షలు వెనుకబడి ఉంది. అలాగే, కృష్ణాలోనూ రూ. 9 లక్షలు వసూలు చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి పూర్తి కావడం కష్టమేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X