Akhanda 13days Collections: మరింత తగ్గిన అఖండ కలెక్షన్లు.. అన్ని కోట్ల లాభంతో మరో రికార్డుకు చేరువ
చాలా కాలంగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నా.. ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుసగా ప్రాజెక్టులను చేస్తూనే వచ్చారు. కానీ, ఆయనకు సరైన సక్సెస్ మాత్రం సొంతం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో రెండు భారీ విజయాలను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి ఆయన చేసిన చిత్రమే 'అఖండ'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీనికి ఆరంభం నుంచే కలెక్షన్లు వెల్లువెత్తాయి. మరి 'అఖండ' పదమూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది? ఇప్పటి వరకూ ఎంత లాభాన్ని అందుకుంది? చూద్దాం పదండి!

అఖండగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య
సింహా, లెజెండ్ తర్వాత నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన చిత్రమే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

బాలయ్య కెరీర్‌లోనే రికార్డు స్థాయిలో
బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్. ఈ మూవీ రేంజ్‌ను బట్టే దీన్ని ఎక్కువ థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేశారు.

13వ రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?
అఖండకు తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజు కలెక్షన్లు మరింతగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 30 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 74 లక్షలు షేర్, రూ. 1.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

13 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
'అఖండ'కు 13 రోజులకు కలిపి భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 18.09 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.87 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.61 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.77 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.90 కోట్లు, గుంటూరులో రూ. 4.37 కోట్లు, కృష్ణాలో రూ. 3.30 కోట్లు, నెల్లూరులో రూ. 2.38 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 54.48 కోట్లు షేర్, రూ. 88.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటిన 'అఖండ'.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఏపీ, తెలంగాణలో 13 రోజులకు కలిపి రూ. 54.48 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.10 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.88 కోట్లు షేర్, రూ. 109.50 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?
సక్సెస్‌ఫుల్ కాంబోలో వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా పదమూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.88 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 9.88 కోట్లు లాభాలను కూడా అందుకుంది.

మరో రికార్డుకు చేరువగా వచ్చేసింది
నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమాకు 13వ రోజు అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. దీంతో ఇప్పటికే రూ. 9.88 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది. దీనికి మరో రూ. 12 లక్షలు వస్తే పది కోట్ల రూపాయల లాభాలు సొంతం అవుతాయి. అదే జరిగితే ఈ ఏడాది ఎక్కవ లాభాలను అందుకున్న చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంటుంది.


Click it and Unblock the Notifications











