Akhanda Day 6 Collections: బాక్సాఫీస్‌పై బాలయ్య పంజా.. 6 రోజుల్లోనే అన్ని కోట్లా.. ఇదేం స్పీడు సామీ
కరోనా వల్ల తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎన్నో కష్టనష్టాలు ఎదురైన విషయం తెలిసిందే. వరుసగా రెండేళ్లు లాక్‌డౌన్‌లు రావడంతో చాలా సినిమాలు విడుదల కాలేదు. దీంతో పరిశ్రమలో గడ్డు పరిస్థితి కనిపించింది. సెకెండ్ వేవ్ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా.. భారీ విజయాలను మాత్రం అందుకోలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాక్సాఫీస్ దుమ్ము దులిపేసేలా వసూళ్లను రాబడుతూ ఇండస్ట్రీకి ఊపిరిపోసిన చిత్రం 'అఖండ'. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ ఆరో రోజు కూడా అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా మంచి కలెక్షన్లను రాబట్టడంతో పాటు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ఆరు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం పదండి!

‘అఖండ'గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన చిత్రమే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న భారీ స్థాయిలో విడుదలైంది.

అత్యధిక స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్
నటసింహా బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ స్థాయిలో విడుదల చేశారు.

ఆరవ రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?
అఖండకు తెలుగు రాష్ట్రాల్లో ఆరవ రోజు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 91 లక్షలు, సీడెడ్‌లో రూ. 66 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 26 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 15 లక్షలు, కృష్ణాలో రూ. 14 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 2.53 కోట్లు షేర్, రూ. 4.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఆరు రోజులకు కలిపి ఎంత వచ్చింది?
'అఖండ' మూవీకి ఆరు రోజులకు కలిపి భారీ వసూళ్లు వచ్చాయి. నైజాంలో రూ. 14.33 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.38 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.38 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.36 కోట్లు, గుంటూరులో రూ. 3.65 కోట్లు, కృష్ణాలో రూ. 2.65 కోట్లు, నెల్లూరులో రూ. 1.92 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 43.67 కోట్లు షేర్, రూ. 68.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంతంటే
తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటిన 'అఖండ'.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో ఆరు రోజులకు రూ. 43.67 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.50 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 51.82 కోట్లు షేర్, రూ. 84.85 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలి?
సక్సెస్‌ఫుల్ కాంబోలో వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 56 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 51.82 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 2.18 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.
Recommended Video

ఆ మైలురాయిని దాటేసిన బాలయ్య
బాలకృష్ణ చాలా రోజులుగా సరైన విజయం కోసం వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 'అఖండ' ఆయనను హిట్ ట్రాక్ ఎక్కించడంతో పాటు టాలీవుడ్‌లోని భారీ చిత్రాలకు మార్గం సుగుమం చేసింది. ఇక, ఈ చిత్రం ఆరు రోజుల్లోనే యాభై కోట్ల రూపాయల మార్కును దాటేసింది. దీంతో 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత బాలయ్య కెరీర్‌లో మరో 50 కోట్ల చిత్రంగా నిలిచింది.


Click it and Unblock the Notifications











