Akhanda 8days Collections: బాలయ్య ఊచకోతతో లాభాల్లోకి అఖండ.. అన్ని కోట్లతో బన్నీ రికార్డు బద్దలు

చాలా కాలంగా సరైన హిట్ లేక తెగ ఇబ్బందులు పడుతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. అయినప్పటికీ ఆయన సినిమాల మీద సినిమాలు చేస్తూనే వచ్చారు. కానీ, విజయం మాత్రం వరించలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ను అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు బాగా కలిసొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో జత కట్టారు. ఇలా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'అఖండ'. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీనికి ఆరంభం నుంచే కలెక్షన్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తాజాగా 'అఖండ' బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటేసింది. అదే సమయంలో బన్నీ రికార్డు బ్రేక్ అయింది. ఆ వివరాలు మీకోసం!

‘అఖండ'గా మారిపోయిన బాలకృష్ణ

‘అఖండ'గా మారిపోయిన బాలకృష్ణ

రెండు భారీ విజయాల తర్వాత నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన చిత్రమే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న విడుదలైంది.

బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధికం

బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధికం


నటసింహం బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్. ఈ మూవీ రేంజ్‌ను బట్టే దీన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు.

8వ రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

8వ రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

అఖండకు తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు కలెక్షన్లు మరికొంత తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 35 లక్షలు, సీడెడ్‌లో రూ. 25 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 6.20 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. 8వ రోజు రెండు రాష్ట్రాల్లో రూ. 1.03 కోట్లు షేర్, రూ. 1.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

 8 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

8 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

'అఖండ' మూవీకి 8 రోజులకు కలిపి భారీ వసూళ్లు వచ్చాయి. నైజాంలో రూ. 15.22 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.98 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.68 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.15 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.49 కోట్లు, గుంటూరులో రూ. 3.80 కోట్లు, కృష్ణాలో రూ. 2.79 కోట్లు, నెల్లూరులో రూ. 2.03 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 46.14 కోట్లు షేర్, రూ. 72.95 కోట్లు గ్రాస్ వచ్చింది.

 ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటిన 'అఖండ'.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఏపీ, తెలంగాణలో 8 రోజులకు కలిపి రూ. 46.14 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.58 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 54.57 కోట్లు షేర్, రూ. 90 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఎనిమిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 54.57 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 57 లక్షలు లాభాలను కూడా అందుకుంది.

బన్నీ రికార్డ్ బ్రేక్.. టాలీవుడ్‌లో 16

బన్నీ రికార్డ్ బ్రేక్.. టాలీవుడ్‌లో 16

'అఖండ' బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఫినీష్ చేయడంతో ఈ ఏడాది హిట్ అయిన 16వ తెలుగు సినిమాగా నిలిచింది. అదే సమయంలో రూ. 90 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. అంతేకాదు, ఓవర్సీస్‌లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన బోయపాటి శ్రీను సినిమాల్లో టాప్‌కు (882 డాలర్లు) చేరింది. తాజాగా ఈ మూవీ సరైనోడు (879 డాలర్లు)ను దాటేసింది. ఇంకా అదే రెస్పాన్స్‌తో ముందుకు సాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X