రెండు రోజుల్లో 'రూలర్' పైసా వసూల్.. బాలకృష్ణ ఇమేజ్ పరంగా చూస్తే!
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన తాజా సినిమా రూలర్. డిసెంబర్ 20వ తేదీన విడుదలైన ఈ సినిమా తొలిరోజే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. చిత్రంలో బాలయ్య నటనకు మంచి మార్కులు పడ్డప్పటికీ కలెక్షన్స్ పరంగా రెండో రోజే పల్టీ కొట్టింది. కాసులు కురిపించడంతో రెండు రోజుల్లో రూలర్ పర్‌ఫార్‌మెన్స్ ఎలా ఉందో చూద్దామా..

విడుదలకు ముందు డిమాండ్.. సూపర్ బిజినెస్
'జై సింహా' సినిమా తర్వాత బాలకృష్ణ- కెఎస్ రవికుమార్ సక్సెస్‌ఫుల్ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో రూలర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు విడుదలకు ముందే భారీ డిమాండ్ నెలకొంది. ఈ ఎఫెక్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్‌పై కూడా పడటంలో మాంచి బిజినెస్ జరిగింది.

ఏరియా వైజ్ బిజినెస్..
విడుదలకు ముందే హైప్ రావడంతో రూలర్ మూవీ అన్ని ఏరియాల్లో మంచి రేటుకే అమ్ముడుపోయింది. నైజాంలో 5.3, సీడెడ్‌లో 5.2, ఈస్ట్ 1.55, వెస్ట్ 1.4, గుంటూరు 2.7, కృష్టా 1.5, నెల్లూరు 1.1, మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 21 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ అన్ని ఇంకో రెండున్నర కోట్ల వరకు జరగ్గా.. మొత్తానికి ఈ చిత్రం 23-24కోట్ల వరకు బిజినెస్ జరిగింది.

మొదటి రెండు రోజులు.. పైసా వసూల్
ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తొలిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.29 కోట్ల షేర్ వసూలు చేసి ఫర్వాలేదనిపించుకుంది. ఇక రెండోరోజుకు వచ్చే సరికి ఆ ఫిగర్ మరింత పడిపోయి 2.5 కోట్ల వరకు షేర్ మాత్రమే వసూలయింది. బాలయ్య ఇమేజ్‌తో కంపేర్ చేస్తే ఈ పైసా వసూల్ చాలా తక్కువే మరి.

రూలర్ భవిష్యత్ డిసైడ్ చేసేది మూడో రోజే..
మాస్ సినిమా కావడంతో బి, సి సెంటర్స్‌లో రూలర్ ఎఫెక్ట్ కాస్త కనిపిస్తోంది. ఓపెనింగ్స్ వరకు బాలయ్య సత్తా చూపిస్తున్నాడు కానీ లాంగ్ రన్ మాత్రం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. ఇకపోతే మూడో రోజు కలెక్షన్స్ రూలర్ భవిష్యత్ డిసైడ్ చేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

సోనాల్ చౌహాన్, వేదిక అందాల ఆరబోత
తమిళ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 105వ ప్రాజెక్టుగా రూలర్ రూపొందింది. ఈ చిత్రానికి బడా నిర్మాత సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించారు. చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటించి అందాల ఆరబోశారు.


Click it and Unblock the Notifications











