For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రూలర్’ ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్: బాలయ్య వసూళ్లు ఎలా ఉన్నాయంటే..

    |

    నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన తాజా సినిమా 'రూలర్'. తమిళ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. షూటింగ్ సమయం నుంచే అప్‌డేట్స్ ఇస్తూ రూలర్ పై హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్ తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అలా మొదటివారం పూర్తిచేసుకున్న రూలర్ మొత్తంగా ఎంత రాబట్టాడో చూద్దామా..

    విడుదలకు ముందు.. విడుదల తర్వాత

    విడుదలకు ముందు.. విడుదల తర్వాత

    రూలర్ పై నందమూరి అభిమానులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయని తాజా రిపోర్ట్స్ ప్రకారం చూస్తే అర్థమవుతోంది. 'జై సింహా' సినిమా తర్వాత బాలకృష్ణ- కెఎస్ రవికుమార్ సక్సెస్‌ఫుల్ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో రూలర్ పై భారీ అంచనాలు ఉండటంతో.. ఈ ఎఫెక్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్‌పై పడింది. ఈ మేరకు మాంచి బిజినెస్ జరిగింది. కానీ విడుదలయ్యాక మార్కెట్ తలక్రిందులైనట్లుగా తెలుస్తోంది.

    రోజు వారి లెక్కలు చూస్తే..

    రోజు వారి లెక్కలు చూస్తే..

    భారీ అంచనాల నడుమ విడుదలైన రూలర్ సినిమా తొలిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.29 కోట్ల షేర్ వసూలు చేసి ఫర్వాలేదనిపించుకుంది. అలాగే రెండో రోజుకు వచ్చేసరికి ఆ ఫిగర్ కొంత పడిపోయి 2.5 కోట్ల వరకు షేర్ మాత్రమే వసూలైంది. ఆ తర్వాత మూడో రోజు ఆ వసూళ్లు మరీ పడిపోయాయి. అదే తీరు నాలుగో రోజు కూడా కంటిన్యూ అయింది.

    మూడు రోజుల డిటైల్ రిపోర్ట్

    మూడు రోజుల డిటైల్ రిపోర్ట్

    నైజాం 1.28 కోట్లు, సీడెడ్ 1.68 కోట్లు, నెల్లూరు 30 లక్షలు, కృష్ణా 31 లక్షలు, గుంటూరు 1.34 కోట్లు, వైజాగ్ 48 లక్షలు, తూర్పుగోదావరి 37 లక్షలు, పశ్చిమ గోదావరి 35 లక్షలు, మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో షేర్ 6.11 కోట్లుగా నమోదైంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 60 లక్షలు, ఓవర్‌సీస్ 20 లక్షలు కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మొత్తం షేర్ 6.91 కోట్లుగా ఉంది.

    ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్..

    ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్..

    విడుదలకు ముందే హైప్ రావడంతో రూలర్ మూవీ అన్ని ఏరియాల్లో మంచి రేటుకే అమ్ముడుపోయింది. నైజాంలో 5.3, సీడెడ్‌లో 5.2, ఈస్ట్ 1.55, వెస్ట్ 1.4, గుంటూరు 2.7, కృష్టా 1.5, నెల్లూరు 1.1, మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 21 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ అన్ని ఇంకో రెండున్నర కోట్ల వరకు జరగ్గా.. మొత్తానికి ఈ చిత్రం 23-24కోట్ల వరకు బిజినెస్ జరిగింది.

    ‘రూలర్' ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్ ప్రకారం

    ‘రూలర్' ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్ ప్రకారం

    ఇక ‘రూలర్' సినిమాకు వచ్చిన ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్ ప్రకారం పరిశీలిస్తే బాక్సాఫీస్ వద్ద సినిమా చతికిలపడినట్లే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. రానున్న రోజుల్లో ఎంత పర్‌ఫార్మ్ చేసినా సినిమా లాభాల బాట పట్టడం కష్టమే అని చెబుతున్నారు విశ్లేషకులు.

    English summary
    Ruler first weekend World Wide Box office Collections report is out. In this movie Nandamuri Balakrishna, Sonal Chauhan, Vedhika And Bhumika Are Played Important Roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X