Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'రూలర్' 8 రోజుల వసూళ్లు.. బాలకృష్ణ సినిమా మరీ ఈ రేంజ్‌లోనా!
నందమూరి బాలకృష్ణ హీరోగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది 'రూలర్' సినిమా. తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమా అప్డేట్స్ విడుదలకు ముందే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. కానీ విడుదల తర్వాత ఆ హైప్ ఒక్క రోజు మాత్రమే నిలిచి ఆ తర్వాత డీలా పడింది. ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం 8 రోజుల్లో రూలర్ పరిస్థితి ఎలా ఉందంటే..
బ్రేక్ ఈవెన్.. అందని ద్రాక్షనే
రూలర్ పై నందమూరి అభిమానులు పెట్టుకున్న ఆశలు ఆవిరే అని 8 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్స్ చూస్తుంటే స్పష్టమవుతోంది. మొదటి రోజు ఫర్వాలేదనిపించుకున్న రూలర్.. ఆ తర్వాత క్రమంగా డీలా పడ్డాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల తాకిడి చూస్తుంటే ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడం అనేది అందని ద్రాక్షనే అని తెలుస్తోంది.
మొదటి రోజు ఓపెనింగ్స్.. ఆ తర్వాత
మొదటి రోజు మిక్స్డ్ టాక్‌తో డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ.. ఆ తర్వాత రెండో రోజు నుండీ ఈ చిత్రాన్ని పట్టించుకున్నవాళ్ళే లేరు. మొత్తంగా చూస్తే ఈ 8 రోజుల్లో రూలర్ హవా ఏ మాత్రం కనిపించలేదు. దీంతో ఈ సినిమా ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా కేవలం 9.28 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది.
ఏరియావైజ్ రిపోర్ట్
'రూలర్' 8 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్లు చూస్తే.. నైజాంలో 1.81 కోట్లు, సీడెడ్ లో 2.04 కోట్లు, ఉత్తరాంధ్రలో 0.56 కోట్లు, ఈస్ట్ గోదావరి 50 లక్షలు, వెస్ట్ గోదావరి 42 లక్షలు, కృష్ణా 42 లక్షలు, నెల్లూరు 35 లక్షలు, గుంటూరు 1.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.12 కోట్లు, ఓవర్సీస్ 56 లక్షలు రాబట్టింది రూలర్ సినిమా.
రిపోర్ట్‌ని బట్టి చూస్తే..
'జై సింహా' సినిమా తర్వాత బాలకృష్ణ- కెఎస్ రవికుమార్ సక్సెస్ఫుల్ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో రూలర్ పై భారీ అంచనాలు నెలకొని ఈ ఎఫెక్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్‌పై పడింది. ఈ మేరకు మాంచి బిజినెస్ జరిగింది. కానీ విడుదలయ్యాక మార్కెట్ తలక్రిందులైనట్లుగా తాజా రిపోర్ట్‌ని బట్టి తెలుస్తోంది.
కనీసం అదైనా వచ్చేనా?
ఈ చిత్రానికి 24 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 9.28 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఈ లెక్కన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 14.8 కోట్ల వరకూ షేర్ రాబట్టాలి. అది చాలా కష్టం అంటున్నారు విశ్లేషకులు. కనీసం 10 కోట్ల షేర్ మార్క్ అయినా దాటుతాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.