బాలయ్య కూడా రెమ్యునరేషన్ పెంచేశాడు.. ఆ సినిమాకు కెరీర్ లోనే అత్యధిక పేమెంట్!
టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, నాగార్జున ఉన్నారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ ఇమేజ్ లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలతో సమానంలో సినిమాల కలెక్షన్స్ విషయంలో పోటీ పడుతున్నారు. అందుకే మెగాస్టార్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధం అయిపోతున్నారు.
రీమేక్ స్టొరీ అయిన కూడా మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఉంటే ఈజీగా ఈ చిత్రంపై వంద కోట్ల వ్యాపారం జరుగుతుంది. ప్రస్తుతం మెగాస్టార్ భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. దీనికి 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇక ఆ తరువాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సీనియర్ హీరోగా నందమూరి బాలకృష్ణ ఉన్నారు.

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం బాలయ్య ఏకంగా 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారంట. అఖండ రిలీజ్ కి ముందు బాలకృష్ణ 10 కోట్ల వరకు చార్జ్ చేసేవారు. అయితే అఖండ బ్లాక్ బస్టర్ తో బాలయ్య రెమ్యునరేషన్ 15 కోట్లకి పెరిగింది. తరువాత వీరసింహారెడ్డితో మరో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి మూవీ చేస్తున్నారు. ఈ సినిమాపై కూడా మంచి పాజిటివ్ టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం సితార ఎంటర్టైన్మెంట్స్ ఏకంగా 25 కోట్ల వరకు బాలయ్యకి రెమ్యునరేషన్ గా ఇస్తున్నారంట. ఇప్పుడు ఇది టాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. వీరి తర్వాత విక్టరీ వెంకటేష్, నాగార్జున ఒక్కో సినిమాకి 10 నుంచి 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారంట.

ఇక మాస్ మహారాజ్ రవితేజ 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే టాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ గా యంగ్ రెబల్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉండటం విశేషం. అతను ఒక్కో సినిమాకి 100 కోట్లకి పైన చార్జ్ చేస్తున్నారు. తరువాత జాబితాలో తారక్, రామ్ చరణ్ ఉన్నారు. అలాగే మహేష్ బాబు కూడా 70 నుంచి 80 కోట్ల వరకు ఒక్కో సినిమాకి తీసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











