Daaku Maharaaj Day 1 Box Office : డాకు మహారాజ్ ఊచకోత... ఓపెనింగ్స్‌లో బాలయ్య రికార్డ్ , ఎన్ని కోట్లంటే?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ - బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన హై వోల్టేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తనకు బాగా కలిసొచ్చిన సంక్రాంతికి బాలయ్య ఎలాంటి మేజిక్ చేస్తాడోనని ట్రేడ్ పండితులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో బాలకృష్ణ సాలీడ్ ఓపెనింగ్స్ రాబట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిస్తే :
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టి మంచి ఊపులో ఉన్నాడు బాలయ్య. ఆయనకి అదే రేంజ్‌లో సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) జత కలవడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్ , చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్ , హిమజ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. థమన్ స్వరాలు సమకూర్చారు.

టీజర్ , ట్రైలర్లతో పాటు గుర్రంపై వెళ్తున్న బాలకృష్ణ లుక్ తదితర అంశాలతో డాకు మహారాజ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్లుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. నైజాంలో రూ. 17.50 కోట్లు, రాయలసీమలో రూ.15.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.6 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.5 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ. 5.4 కోట్లు, గుంటూరులో రూ. 7.2 కోట్లు, నెల్లూరులో రూ.2.7 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.30 కోట్ల బిజినెస్ చేసింది డాకు మహారాజ్.
అలాగే ఓవర్సీస్‌లో రూ.8 కోట్లు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ.5.40 కోట్లు మొత్తంగా రూ.80.70 కోట్లు బిజినెస్ చేసింది. ఇది ఇప్పటి వరకు బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీని ప్రకారం డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే రూ.82 కోట్ల షేర్.. రూ. 170 కోట్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.
అడ్వాన్స్ బుకింగ్స్, ఏపీ, ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ , స్పెషల్ కారణంగా బుకింగ్స్‌లో ఎక్సలెంట్ హోల్డ్ చూపించింది డాకు మహారాజ్. స్పెషల్ షోల నుంచే మంచి టాక్ , పాజిటివ్ రివ్యూలతో ఈ సినిమా దూసుకెళ్తోంది. ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్న డాకు మహారాజ్ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ. 25 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే యూఎస్‌లో అప్పుడే 1 మిలియన్ క్లబ్‌లోకి అడుగుపెట్టాడు బాలయ్య. మరి సంక్రాంతి సీజన్‌లో బాలకృష్ణ ఏ రేంజ్‌లో వసూళ్లు సాధిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











