Daaku Maharaaj Day 11 collections: ‘డాకు మహారాజ్’అరాచకం.. 11 వ రోజు ఎన్ని కోట్లంటే?
Daaku Maharaaj Day 11 collections: నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన హై వోల్టేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ' డాకు మహారాజ్'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ కు పాజివిట్ టాక్ రావడంతో బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ హై వోల్టేజీ యాక్షన్ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ గ్రాస్ చేయాలంటే ఎన్ని కోట్లు వసూలు చేయాలి? గత 11 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్స్ ఎంత ? అనే వివరాల్లోకి వెళితే..
హ్యాట్రిక్ విజయాలతో జోష్ లో ఉన్న బాలయ్య.. వరుస విజయాలను అందుకున్న యంగ్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర (బాబీ)ల కాంబోలో తెరకెక్కిన మాస్ కాంబో 'డాకు మహారాజ్'. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ, సాయి సౌజన్యలు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్. ఎస్ మ్యూజిక్ అందించారు.

ఇక 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. విడుదలకు ముందు డాకు మహారాజ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎవరుఊహించని విధంగా ఈ మూవీకి రూ. 84 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే.. రూ.85 కోట్ల షేర్.. రూ. 170 కోట్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాను సుమారుగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. బాలయ్య తన సినీ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా 'డాకు మహారాజ్' నయా రికార్డు క్రియేట్ చేసింది.
డాకు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే..తొలి రోజు పాజిటివ్ టాక్ అందుకోవడంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.25.35 కోట్లు అందుకోగా.. ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ ఫస్ట్ డే రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. 2వ రోజు రూ. 13.50 కోట్లు, 3వ రోజు రూ.12.50 కోట్లు,4వ రోజు రూ. 9.75 కోట్లు, 5 వ రోజు రూ. 6.25 కోట్లు, 6వ రోజు రూ. 4.5 కోట్లు, 7వ రోజు రూ. 4 కోట్లు, 8వ రోజు రూ.4.20 కోట్లు, 9వ రోజు రూ. 1.6 కోట్లు, 10వ రోజు రూ.1.40 కోట్లు రాబట్టింది.
ఇక 'డాకు మహారాజ్' 11వ రోజు కలెక్షన్స్ (Daaku Maharaaj Day 11 collections) వివరాలకు వస్తే.. నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ ప్రకారం.. 11వ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 1.04 కోట్లు వసూలు రాబట్టింది. దీనితో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ మొత్తం రూ. 82.34 కోట్లకు చేరింది. ఇక మూవీ వరల్డ్ వైడ్ గా రూ.160 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సంపాదించింది. ఇక 'డాగు మహారాజ్' ఆక్యుపెన్సీ విషయానికి వస్తే..తెలుగురాష్ట్రాల్లో బుధవారం నాడు 15.44% ఆక్యుపెన్సీతో రన్ అయింది. సంక్రాంతి సెలవులు, వీకెండ్ పూర్తికావడంతో కలెక్షన్లు పడిపోయాయి.
ఇదిలాఉంటే..డాకు మహారాజ్ రేపటి నుంచి ( జనవరి 24) నార్త్ లో తన జైత్రయాత్ర ప్రారంభించబోతున్నాడు. ఈ మూవీని హిందీలో డబ్ చేసి విడుదల చేయాలని మూవీ మేకర్స్ సిద్దమయ్యారు. డాకు మహారాజ్ సినిమా కథ దాదాపు నార్త్ లోనే జరుగుతుంది కాబట్టి కలిసి వస్తుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో నార్త్ లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక మరో విషయమేమిటంటే.. హిందీ వెర్షన్ లో బాలకృష్ణ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం మరో విశేషం.


Click it and Unblock the Notifications











