Daaku Maharaaj Day 12 collections: నార్త్‌లో డాకు మహారాజ్ దండయాత్ర .. 12 వ రోజు ఎన్ని కోట్లంటే?
Daaku Maharaaj Day 12 collections: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన హై వోల్టేజీ యాక్షన్ మూవీ 'డాకు మహారాజ్'( Daaku Maharaaj). ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ కు పాజివిట్ టాక్ రావడంతో బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ హై వోల్టేజీ యాక్షన్ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ గ్రాస్ చేయాలంటే ఎన్ని కోట్లు వసూలు చేయాలి? గత 11 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్స్ ఎంత ? అనే వివరాల్లోకి వెళితే..
హ్యాట్రిక్ సక్సెస్ తో జోష్ లో ఉన్న బాలయ్య.. వరుస విజయాలతో స్వింగ్ లో ఉన్న యంగ్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర (బాబీ)ల కాంబోలో తెరకెక్కిన మాస్ కాంబో 'డాకు మహారాజ్'. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ, సాయి సౌజన్యలు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్. ఎస్ సంగీతం అందించారు.

ఇక 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. విడుదలకు ముందు డాకు మహారాజ్ పై భారీ అంచనాలు నెలకొనడంతో ఎవరు ఊహించని రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీకి రూ.84 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే.. రూ.85 కోట్ల షేర్.. రూ. 170 కోట్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాను సుమారుగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. బాలయ్య తన సినీ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా 'డాకు మహారాజ్' రికార్డు క్రియేట్ చేసింది.
డాకు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే..తొలి రోజు పాజిటివ్ టాక్ అందుకోవడంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.25.35 కోట్లు అందుకోగా.. ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ ఫస్ట్ డే రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. 2వ రోజు రూ. 13.50 కోట్లు, 3వ రోజు రూ.12.50 కోట్లు,4వ రోజు రూ. 9.75 కోట్లు, 5 వ రోజు రూ. 6.25 కోట్లు, 6వ రోజు రూ. 4.5 కోట్లు, 7వ రోజు రూ. 4 కోట్లు, 8వ రోజు రూ.4.20 కోట్లు, 9వ రోజు రూ. 1.6 కోట్లు, 10వ రోజు రూ.1.40 కోట్లు, 11వ రోజు రూ. 1.04 కోట్లు రాబట్టింది.
ఇక 'డాకు మహారాజ్' 12వ రోజు కలెక్షన్స్ (Daaku Maharaaj Day 12 collections) వివరాలకు వస్తే.. నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. 12వ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1.13 కోట్లు వసూలు రాబట్టింది. దీనితో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ మొత్తం రూ. 83.53 కోట్లకు చేరింది. కానీ మొదటి వారం రూ. 66.4 కోట్లు వసూలు చేయగా.. రెండో వారం మాత్రం రూ. 17.13 కోట్లు కలెక్ట్ చేసింది. ఇదిలాఉంటే.. ఇక డాకు మహారాజ్ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.163 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సంపాదించింది.
ఇక డాకు మహారాజ్ నేటీ నుంచి నార్త్ లో తన జైత్రయాత్ర ప్రారంభించనున్నాడు. ఈ మూవీని హిందీలో డబ్ చేస్తున్నారు. ఈ సినిమా కథ దాదాపు నార్త్ లోనే జరుగుతుంది.అలాగే.. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ నటించారు. కాబట్టి. ఈ విషయం కలిసి వస్తుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. అందుకే హిందీలో విడుదల చేయాలని భావించారు. మరో విషయమేమిటంటే.. హిందీ వెర్షన్ లో బాలకృష్ణ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారంట.


Click it and Unblock the Notifications











