Daaku Maharaaj Day 13 collections: హిందీలో డాకు ఊచకోత .. 13వ రోజు ఎన్ని కోట్లంటే?

Daaku Maharaaj Day 13 collections: నందమూరి నట సింహం బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ (Daaku Maharaaj ). ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ కు పాజివిట్ టాక్ రావడంతో బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. దీంతో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని జనవరి 24న హిందీ వర్షన్ లో విడుదల చేశారు. ఈ తరుణంలో డాకు మహారాజ్ ఇప్పటివరకు ఎంత వసూలు చేసింది. మరీ 13వ రోజు డాగు మహారాజ్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయంటే..?

హ్యాట్రిక్ సక్సెస్ తో జోష్ లో ఉన్న బాలయ్య, వరుస విజయాలతో స్వింగ్ లో ఉన్న డైరెక్టర్ కేఎస్ రవీంద్ర (బాబీ)ల కాంబోలో తెరకెక్కిన మాస్ మూవీ 'డాకు మహారాజ్'. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్‌, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్. ఎస్ సర్వాలు సమకూర్చారు.

Nandamuri Balakrishna Urvashi Rautela Daaku Maharaaj Day 13 Box Office Collection Worldwide

ఇక 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. ఎవరు ఊహించని రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీకి రూ.84 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే.. రూ.85 కోట్ల షేర్.. రూ. 170 కోట్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాను సుమారుగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. బాలయ్య తన సినీ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా 'డాకు మహారాజ్' రికార్డు క్రియేట్ చేసింది.

డాకు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. పాజిటివ్ టాక్ అందుకోవడంతో తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.25.35 కోట్లు అందుకోగా.. ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ ఫస్ట్ డే రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. 2వ రోజు రూ. 13.50 కోట్లు, 3వ రోజు రూ.12.50 కోట్లు, 4వ రోజు రూ. 9.75 కోట్లు, 5 వ రోజు రూ.6.25 కోట్లు, 6వ రోజు రూ. 4.5 కోట్లు, 7వ రోజు రూ. 4 కోట్లు, 8వ రోజు రూ.4.20 కోట్లు, 9వ రోజు రూ. 1.6 కోట్లు, 10వ రోజు రూ.1.40 కోట్లు, 11వ రోజు రూ. 1.04 కోట్లు, 12వ రోజు రూ.1.15 కోట్లు రాబట్టింది.

ఇక 'డాకు మహారాజ్' 13వ రోజు కలెక్షన్స్ (Daaku Maharaaj Day 13 collections) వివరాలకు వస్తే.. నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.అలాగే నిన్న డాకు మహారాజ్ హిందీ వర్షన్ విడుదల అయింది. హిందీ బెల్టులో ముందుగా 200 థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ, ఊహించని తీరులో తెలుగు సినిమాలకు రెస్పాన్స్ వస్తుడటం, పుష్ప2 వసూళ్లు నెమ్మదించడంతో 600 థియేటర్లలో భారీగా విడుదల చేశారు.

దీంతో డాకు మహారాజ్ హిందీలో కూడా హవా కొనసాగిస్తోంది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1.8 కోట్లు వసూలు సాధించింది. దీంతో డాకు మహారాజ్ ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.85.65 కోట్లు రాబట్టింది. ఇదిలాఉంటే.. ఇక డాకు మహారాజ్ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.167 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సంపాదించింది. ఇక ఈ వీకెండ్ లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X