Daaku Maharaaj Day 13 collections: నార్త్ లో బాలయ్య దబిడి దిబిడి.. 'డాకూ మహారాజ్'13వ రోజు ఎన్ని కోట్లంటే?
Daaku Maharaaj Day 13 collections: నందమూరి నట సింహం బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ (Daaku Maharaaj ). ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ కు పాజివిట్ టాక్ రావడంతో బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. మరోవైపు.. నేటీ నుంచి హిందీ వర్షన్ లో కూడా యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ విడుదలైంది. ఈ తరుణంలో డాకు మహారాజ్ 13వ రోజు అంచనా కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..
హ్యాట్రిక్ సక్సెస్ తో జోష్ లో ఉన్న బాలయ్య.. వరుస విజయాలతో స్వింగ్ లో ఉన్న యంగ్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర (బాబీ)ల కాంబోలో తెరకెక్కిన మాస్ కాంబో 'డాకు మహారాజ్'. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ, సాయి సౌజన్యలు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్. ఎస్ సంగీతం అందించారు.

ఇక 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. విడుదలకు ముందు డాకు మహారాజ్ పై భారీ అంచనాలు నెలకొనడంతో ఎవరు ఊహించని రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీకి రూ.84 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే.. రూ.85 కోట్ల షేర్.. రూ. 170 కోట్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాను సుమారుగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. బాలయ్య తన సినీ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా 'డాకు మహారాజ్' రికార్డు క్రియేట్ చేసింది.
డాకు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. పాజిటివ్ టాక్ అందుకోవడంతో తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.25.35 కోట్లు అందుకోగా.. ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ ఫస్ట్ డే రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. 2వ రోజు రూ. 13.50 కోట్లు, 3వ రోజు రూ.12.50 కోట్లు, 4వ రోజు రూ. 9.75 కోట్లు, 5 వ రోజు రూ.6.25 కోట్లు, 6వ రోజు రూ. 4.5 కోట్లు, 7వ రోజు రూ. 4 కోట్లు, 8వ రోజు రూ.4.20 కోట్లు, 9వ రోజు రూ. 1.6 కోట్లు, 10వ రోజు రూ.1.40 కోట్లు, 11వ రోజు రూ. 1.04 కోట్లు, 12వ రోజు రూ.1.15 కోట్లు రాబట్టింది. మొత్తం రూ.83.55 కోట్లు రాబట్టింది.ఇదిలాఉంటే.. ఇక డాకు మహారాజ్ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.165 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సంపాదించింది.



Click it and Unblock the Notifications











