Daaku Maharaaj Day 14 collections: బాక్సాఫీస్ ను షేకాడిస్తున్న డాకు మహారాజ్.. 14 వ రోజు ఎన్ని కోట్లంటే?
Daaku Maharaaj Day 14 collections: నందమూరి నట సింహం బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ (Daaku Maharaaj). సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన హై యాక్షన్ వోల్టేజీ మూవీ డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. భారీ విజయం అందుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జనవరి 24న హిందీ వర్షన్ లో కూడా విడుదలైంది. ఈ తరుణంలో డాకు మహారాజ్ ఇప్పటివరకు ఎంత వసూలు చేసింది. 14వ రోజు డాకు మహారాజ్ అంచనా కలెక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయంటే..?
వరుస విజయాలతో పుల్ జోష్ లో ఉన్న బాలయ్య -డైరెక్టర్ బాబీల కాంబోలో వచ్చింది 'డాకు మహారాజ్'. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్.ఎస్ సర్వాలు సమకూర్చారు.

ఇక 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. ఎవరు ఊహించని విధంగా రూ.84కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.76.1 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఈ సినిమాను సుమారుగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. బాలయ్య తన సినీ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా 'డాకు మహారాజ్' రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.85.65 కోట్లు రాబట్టింది.
డాకు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. పాజిటివ్ టాక్ అందుకోవడంతో తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.25.35 కోట్లు అందుకోగా.. ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ ఫస్ట్ డే రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. 2వ రోజు రూ. 13.50 కోట్లు, 3వ రోజు రూ.12.50 కోట్లు, 4వ రోజు రూ.9.75 కోట్లు, 5వ రోజు రూ.6.25 కోట్లు, 6వ రోజు రూ. 4.5కోట్లు, 7వ రోజు రూ. 4 కోట్లు, 8వ రోజు రూ.4.20 కోట్లు, 9వ రోజు రూ.1.6 కోట్లు, 10వ రోజు రూ.1.40 కోట్లు, 11వ రోజు రూ. 1.04 కోట్లు, 12వ రోజు రూ.1.15 కోట్లు, 13వ రోజు 1.8 కోట్లు రాబట్టింది.
ఇక 'డాకు మహారాజ్' 14వ రోజు కలెక్షన్స్ (Daaku Maharaaj Day 14 expected collections) వివరాలకు వస్తే.. నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.అలాగే నిన్న డాకు మహారాజ్ హిందీ వర్షన్ విడుదల అయింది. దీంతో నార్త్ లో డాగు హావా కొనసాగిస్తోంది. 14 రోజు అంచనాల ప్రకారం.. డాకు మహారాజ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1 - 1.2 కోట్ల వరకు సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ వరకు డాకు మహారాజ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.86.65 కోట్లు రాబట్టింది. ఇక ఈ వీకెండ్ లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











