Daaku Maharaaj Day 16 collections: తగ్గిన ‘డాకు మహారాజ్’కలెక్షన్స్.. 16 వ రోజు ఎన్ని కోట్లంటే?
Daaku Maharaaj Day 16 collections: గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ (Daaku Maharaaj). సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హై వోల్టేజీ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. అలాగే.. భారీ మొత్తంలో కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే భారీ విజయం అందుకున్న డాకు మహారాజ్ జనవరి 24న హిందీ వర్షన్ లో కూడా విడుదలైంది. వీకెండ్స్ లో దుమ్మురేపిన.. వర్కింగ్ డేస్ లో మాత్రం కాస్త వెనకడుగు వేసింది. ఈ తరుణంలో డాకు మహారాజ్ ఇప్పటివరకు ఎంత వసూలు చేసింది. 16వ రోజు డాకు మహారాజ్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయంటే?
హ్యాటిక్ సక్సెస్ లో పుల్ జోష్ లో ఉన్న బాలయ్య, వరుస విజయాలతో ఉత్సహంగా ఉన్న డైరెక్టర్ బాబీల కాంబోలో తెరకెక్కిన మూవీ 'డాకు మహారాజ్'. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్.ఎస్ సంగీతం అందించారు.

ఇక 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. విడుదల ముందే డాకు మహారాజ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఎవరు ఊహించని విధంగా రూ.84కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ గా రూ.76 కోట్లు గా నిర్ణయించారు. ఈ సినిమాను సుమారుగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. బాలయ్య తన సినీ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా 'డాకు మహారాజ్'రికార్డు క్రియేట్ చేసింది.
ఇక డాకు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. అంచనాలకు తగ్గట్టుగానే పాజిటివ్ టాక్ అందుకుంది. దీంతో డాకు మహారాజ్ తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.25.35 కోట్లు అందుకోగా.. ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ ఫస్ట్ డే రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. 2వ రోజు రూ. 13.50 కోట్లు, 3వ రోజు రూ.12.50 కోట్లు, 4వ రోజు రూ.9.75 కోట్లు, 5వ రోజు రూ.6.25 కోట్లు, 6వ రోజు రూ. 4.5కోట్లు, 7వ రోజు రూ. 4 కోట్లు, 8వ రోజు రూ.4.20 కోట్లు, 9వ రోజు రూ.1.6 కోట్లు, 10వ రోజు రూ.1.40 కోట్లు, 11వ రోజు రూ. 1.04 కోట్లు, 12వ రోజు రూ.1.15 కోట్లు, 13వ రోజు 1.02 కోట్లు, 14 రోజు రూ. 1.35 కోట్లు , 15 వ రోజు 1.8 కోట్లు రాబట్టింది.
ఇక 'డాకు మహారాజ్' 16వ రోజు కలెక్షన్స్ (Daaku Maharaaj Day 16 collections) వివరాలకు వస్తే.. కలెక్షన్స్ చాలా పడిపోయాయి. వీకెండ్ లో కుమ్మేసిన డాకు .. వర్కింగ్ డేలో మాత్రం కలెక్షన్స్ అందుకోలేకపోయారు. సోమవారం 16 రోజు రూ. 0.8 కోట్లు వసూలు చేసింది. దీంతో డాకు మహారాజ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.88.5 కోట్లు రాబట్టింది. మరోవైపు తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.100కోట్ల మార్క్ దాటింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సుమారు రూ.165 కోట్లకు పైగా
గ్రాస్ దక్కినట్టు అంచనా.


Click it and Unblock the Notifications











