Daaku Maharaaj Day 17 collections: తగ్గిపోతున్న డాకు మహారాజ్ కలెక్షన్స్.. 17 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Daaku Maharaaj Day 17 collections: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ (Daaku Maharaaj) కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ హై వోల్టేజీ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఇప్పటికే భారీ విజయం అందుకున్న డాకు మహారాజ్ జనవరి 24న హిందీ వర్షన్ లో కూడా విడుదలైంది. వీకెండ్స్ లో దుమ్మురేపిన.. వర్కింగ్ డేస్ లో మాత్రం కాస్త వెనకడుగు వేసింది. ఈ తరుణంలో డాకు మహారాజ్ ఇప్పటివరకు ఎంత వసూలు చేసింది. 17 వ రోజు డాకు మహారాజ్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయంటే?

నందమూరి బాలకృష్ణ-డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన మూవీ 'డాకు మహారాజ్'. సంక్రాంతి బరిలోకి దిగిన డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా నటించారు. చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్‌, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు.

Nandamuri Balakrishna Urvashi Rautela Daaku Maharaaj Day 17 Box Office Collection Worldwide

ఇక 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. విడుదల ముందే డాకు మహారాజ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సుమారుగా రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాకు 80.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 82 కోట్లుగా నమోదు అయింది. అలాగే.. ఎవరు ఊహించని విధంగా రూ.84కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాను సుమారుగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. బాలయ్య తన సినీ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది 'డాకు మహారాజ్'.

డాకు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. అంచనాలకు తగ్గట్టుగానే కలెక్షన్స్ అందుకుంది. తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.25.35 కోట్లు అందుకోగా.. ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ ఫస్ట్ డే రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. 2వ రోజు రూ. 13.50 కోట్లు, 3వ రోజు రూ.12.50 కోట్లు, 4వ రోజు రూ.9.75 కోట్లు, 5వ రోజు రూ.6.25 కోట్లు, 6వ రోజు రూ. 4.5కోట్లు, 7వ రోజు రూ. 4 కోట్లు, 8వ రోజు రూ.4.20 కోట్లు, 9వ రోజు రూ.1.6 కోట్లు, 10వ రోజు రూ.1.40 కోట్లు, 11వ రోజు రూ. 1.04 కోట్లు, 12వ రోజు రూ.1.15 కోట్లు, 13వ రోజు 1.02 కోట్లు, 14 రోజు రూ. 1.35 కోట్లు , 15 వ రోజు 1.8 కోట్లు, 16 వరోజు 0.8 కోట్లు రాబట్టింది.

ఇక 'డాకు మహారాజ్' 17వ రోజు కలెక్షన్స్ (Daaku Maharaaj Day 17 collections) వివరాలకు వస్తే.. కలెక్షన్స్ మరి కాస్త పడిపోయాయి. వీకెండ్ లో కుమ్మేసిన డాకు .. వర్కింగ్ డేలో మాత్రం కలెక్షన్స్ అందుకోలేకపోయారు. హిందీలో జైత్ర యాత్ర సాగిస్తుందని భావించినా అంతగా ప్రభావం చూపించలేదు. ఇలా మంగళవారం నాడు అంటే డే 17 ..కేవలం రూ. 0.7 కోట్లు వసూలు చేసింది. దీంతో డాకు మహారాజ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.89.2 కోట్లు రాబట్టింది. మరోవైపు తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.100కోట్ల మార్క్ దాటింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సుమారు రూ.165 కోట్లకు పైగా గ్రాస్ దక్కినట్టు అంచనా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X