Daaku Maharaaj Day 18 collections: ‘డాకు మహారాజ్’ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్.. 18వ రోజు ఎన్ని కోట్లంటే?
Daaku Maharaaj Day 18 collections: నందమూరి నట సింహం బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ (Daaku Maharaaj). సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ హై వోల్టేజీ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. భారీ విజయం అందుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జనవరి 24న హిందీ వర్షన్ లో కూడా విడుదలైంది. వీకెండ్స్ లో దుమ్మురేపిన.. వర్కింగ్ డేస్ లో మాత్రం కాస్త వెనకడుగు వేసింది. ఈ తరుణంలో డాకు మహారాజ్ ఇప్పటివరకు ఎంత వసూలు చేసింది. 18 వ రోజు డాకు మహారాజ్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయంటే?
సంక్రాంతి బరిలోకి దిగిన డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా నటించారు. చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎస్ తమన్ మ్యూజిక్ అందించారు.

ఇక 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. విడుదల ముందే డాకు మహారాజ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సుమారుగా రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాకు 80.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 82 కోట్లుగా నమోదు అయింది. అలాగే.. ఎవరు ఊహించని విధంగా రూ.84కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాను సుమారుగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. బాలయ్య తన సినీ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది 'డాకు మహారాజ్'.
డాకు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. అంచనాలకు తగ్గట్టుగానే కలెక్షన్స్ అందుకుంది. తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.25.35 కోట్లు అందుకోగా.. ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ ఫస్ట్ డే రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. 2వ రోజు రూ. 13.50 కోట్లు, 3వ రోజు రూ.12.50 కోట్లు, 4వ రోజు రూ.9.75 కోట్లు, 5వ రోజు రూ.6.25 కోట్లు, 6వ రోజు రూ. 4.5కోట్లు, 7వ రోజు రూ. 4 కోట్లు, 8వ రోజు రూ.4.20 కోట్లు, 9వ రోజు రూ.1.6 కోట్లు, 10వ రోజు రూ.1.40 కోట్లు, 11వ రోజు రూ. 1.04 కోట్లు, 12వ రోజు రూ.1.15 కోట్లు, 13వ రోజు 1.02 కోట్లు, 14 రోజు రూ. 1.35 కోట్లు , 15 వ రోజు 1.8 కోట్లు, 16 వరోజు 86 లక్షలు, 17వ రోజు 72 లక్షలు కలెక్ట్ చేసింది. ట్టింది.
ఇక 'డాకు మహారాజ్' 18వ రోజు కలెక్షన్స్ (Daaku Maharaaj Day 18 collections) వివరాలకు వస్తే.. కలెక్షన్స్ మరింత పడిపోయాయి. వీకెండ్ లో దుమ్మురేపిన డాగు మహారాజ్ .. వర్కింగ్ డేస్ లో మాత్రం చతికిలపడుతోంది. అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ అందుకోలేకపోతుంది. హిందీలో జైత్ర యాత్ర సాగిస్తుందని భావించినా.. అంతగా ప్రభావం చూపించలేదు. ఈ నేపథ్యంలో బుధవారం (డే 17) కేవలం రూ 52 లక్షలు మాత్రమే వసూలు చేసింది. దీంతో డాకు మహారాజ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.89.7 కోట్లు రాబట్టింది. మరోవైపు తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.100కోట్ల మార్క్ దాటగా.. ఇప్పటి వరకు ఈ సినిమా సుమారు రూ.165 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











