Daaku Maharaaj Day 19 collections: నయా రికార్డు క్రియేట్ చేసిన ‘డాకు మహారాజ్’.. 19వ రోజు ఎన్ని కోట్లంటే?
Daaku Maharaaj Day 19 collections: నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ (Daaku Maharaaj). సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హై వోల్టేజీ యాక్షన్ మూవీ పాజివిట్ రెస్పాన్స్ అందుకుని, బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. భారీ విజయం అందుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇటీవల హిందీ వర్షన్ లో కూడా విడుదలైంది. బాలకృష్ణ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్‌పై ప్రశంసలు వచ్చాయి. వీకెండ్స్ లో దుమ్మురేపిన.. వర్కింగ్ డేస్ లో మాత్రం కాస్త వెనకడుగు వేసింది. ఈ నేపథ్యంలో 'డాకు మహారాజ్' ఇప్పటివరకు ఎంత వసూలు చేసింది? 19 వ రోజు డాకు మహారాజ్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయంటే?
సంక్రాంతి బరిలోకి దిగిన 'డాకు మహారాజ్'లో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించగా.. చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించగా.. ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్ లో గ్లామర్ స్టెప్పులేసింది. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎస్ తమన్ మ్యూజిక్ అందించారు.

ఇక 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. విడుదల ముందే డాకు మహారాజ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సుమారుగా రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాకు 80.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 82 కోట్లుగా నమోదు అయింది. అలాగే.. ఎవరు ఊహించని విధంగా రూ.84కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాను సుమారుగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. బాలయ్య తన సినీ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది 'డాకు మహారాజ్'.
డాకు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. అంచనాలకు తగ్గట్టుగానే కలెక్షన్స్ అందుకుంది. తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.25.35 కోట్లు అందుకోగా.. ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ ఫస్ట్ డే రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. తొలివారంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 66. 4 కోట్లు కలెక్ట్ చేయగా.. రెండో వారంలో 17.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మూడో వారం కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. కేవలం 5.7 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. కానీ, అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి.. లాభాల బాటలో నడుస్తోంది.
ఇక 'డాకు మహారాజ్' 19వ రోజు కలెక్షన్స్ (Daaku Maharaaj Day 19 collections) వివరాలకు వస్తే.. కలెక్షన్స్ మరింత పడిపోయాయి. వీకెండ్ లో దుమ్మురేపిన డాగు మహారాజ్ .. వర్కింగ్ డేస్ లో మాత్రం చతికిలపడుతోంది. అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ అందుకోలేకపోతుంది. హిందీలో జైత్ర యాత్ర సాగిస్తుందని భావించినా.. అంతగా ప్రభావం చూపించలేదు. ఈ నేపథ్యంలో గురువారం (డే 19) కేవలం రూ. 47లక్షలు మాత్రమే వసూలు చేసింది. దీంతో డాకు మహారాజ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.89.7 కోట్లు రాబట్టింది. మరోవైపు తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.100కోట్ల మార్క్ దాటగా.. ఇప్పటి వరకు ఈ సినిమా సుమారు రూ.165 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











