Daaku Maharaaj Day 2 collections: బాక్సాఫీస్ వద్ద బాలయ్య దబ్బిడి దిబ్బిడే..రెండో రోజు ఎన్ని కోట్లంటే?
Daaku Maharaaj Day 2 collections: నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కిన హై వోల్టేజీ మూవీ డాకు మహారాజ్ (Daaku Maharaaj). ఈ మాస్ యాక్షన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. అలాగే.. సంక్రాంతి బరిలో నిలిచిన గేమ్ చేంజర్ అనుకున్న స్థాయి రాణించకపోవడంతో డాకు మహారాజ్ దుమ్మురేపుతోంది. ఇక బాలయ్య బాబు యాక్షన్, బాబీ విజన్, తమన్ మ్యూజిక్ కలువడవంతో పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో బాలకృష్ణ సాలీడ్ ఓపెనింగ్స్ అందుకున్నాడు డాకు మహారాజ్. ఈ తరుణంలో రెండు రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ యాక్షన్ ఎంటర్టైన్ లో నందమూరి బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ లు ప్రధాన పాత్రలో నటించారు. ఇక బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. థమన్ మ్యూజిక్ అందించారు.

'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి రూ.67.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ఓవర్సీస్ లో రూ. 8 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 5.40 కోట్లు, ఇలా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 80.70 కోట్ల మేర జరిగింది. ఇప్పటి వరకు బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా డాకు మహారాజ్ నయా రికార్డు క్రియేట్ చేసింది. ఇక డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ రూ. 82 కోట్లుగా నిర్ణయించబడింది.
డాకు మహారాజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తొలి రోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. మరోవైపు పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో బాలకృష్ణ సాలీడ్ ఓపెనింగ్స్ అందుకుంది. సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య వన్ మ్యాన్ షో గా నిలిచారు. డాకు మహరాజ్ తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 25.35 కోట్ల వసూలు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా డే 1 రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. వీకెండ్ కావడం.. పైగా పండగ కావడంతో డాకు మహారాజ్ తొలి రోజు రికార్డు స్తాయిలో కలెక్షన్స్ అందుకుంది
ఇక రెండవ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. రెండో రోజు కూడా 'డాకు మహారాజ్' అదే జోరు కోనసాగించింది. ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద రూ. 13. 50 కోట్ల వసూల్లు చేసింది. ఇక ఈ రెండు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'డాకు మహారాజ్' రూ. 38.85 కోట్లు వసుళ్లు చేయగా, వర్డల్ వైడ్ గా రూ. 74 కోట్ల వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మొత్తం బిజినెస్ లో దాదాపు 70 శాతం వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది.
గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య దూకుడుకు బాక్సాఫీస్ కలెక్షన్ తో పాటు అన్నిచోట్ల థియేటర్ ఫుల్ ఆక్యుపెన్సీ కూడా నమోదు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో జోరు ఈ వారం కనిపిస్తే.. కలెక్షన్స్ భారీగా పెరుగుతాయి. అలాగే.. గేమ్ ఛేంజర్ కు మిక్స్ డ్ టాక్ రావడంతో ఆ మూవీ కలెక్షన్లు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన డాకు మహా రాజ్ బాక్సాఫీస్‌ను భారీ కలెక్షన్స్ వసూళ్లు చేసే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంక్రాంతి విజేత బాలయ్య బాబుదే అంటున్నారు ఫ్యాన్స్.


Click it and Unblock the Notifications











