Daaku Maharaaj Day 2 collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న డాకు మహారాజ్.. రెండో రోజు ఎన్ని కోట్లంటే?

Daaku Maharaaj Day 2 collections: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ - బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన హై వోల్టేజీ మూవీ డాకు మహారాజ్ (Daaku Maharaaj ). ఈ మాస్ యాక్షన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్నట్టు గానే బాలయ్యకు బాగా కలిసొచ్చింది. బాలయ్య తన నటనతో విధ్వంసం సృష్టించడానికి సంక్రాంతి బరిలో నిలిచి గెలిచాడనే చెప్పాలి. బాలయ్య బాబు యాక్షన్, బాబీ విజన్, తమన్ మ్యూజిక్ కలువడవంతో పాజిటివ్ రివ్యూలు, మౌత్‌ టాక్‌తో బాలకృష్ణ సాలీడ్ ఓపెనింగ్స్ అందుకున్నాడు డాగు మహారాజ్. ఈ తరుణంలో రెండు రోజు అంచనా కలెక్షన్స్.. వివరాల్లోకి వెళితే..

నందమూరి బాలకృష్ణ ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లతో వరుస విజయాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఈ పుల్ స్వింగ్ లో బాలయ్యతో దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ)దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందు‌లో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్ , చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్‌, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్ , హిమజ తదితరులు కీలక పాత్రలో వహించారు.

Nandamuri Balakrishna Urvashi Rautela Daaku Maharaaj Day 2 Expected Box Office Collection

ఇక బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్రలో అలరించారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం, రూబెన్ - నిరంజన్ దేవరమానే ఎడిటింగ్‌ అందించారు. బాలయ్య యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి థమన్ మ్యూజిక్ అందించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తొలి రోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తుంది. మరోవైపు పాజిటివ్ రివ్యూలు, మౌత్‌ టాక్‌తో బాలకృష్ణ సాలీడ్ ఓపెనింగ్స్ అందుకుంది. మంచి బజ్ క్రియేట్ చేసింది. దీంతో బాలయ్య వన్ మ్యాన్ షో అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

డాకుమహా రాజు తొలి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. డాకు మహరాజ్‌ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 25.35 కోట్ల వసూలు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా డే 1 రూ.56 కోట్లు వసూలు చేసిందంట. నిన్న వీకెండ్, పైగా పండగా కూడా.. దీంతో రికార్డు స్తాయిలో కలెక్షన్స్ అందుకుంది డాకు మహారాజ్. ఇక రెండవ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే... ఇప్పటి వరకు అందిన రిపోర్టు ప్రకారం.. దాదాపు 5.38 కోట్ల వసూల్లు చేసింది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు మొత్తం ₹ 27.88 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

Nandamuri Balakrishna Urvashi Rautela Daaku Maharaaj Day 2 Expected Box Office Collection

ఇప్పటి వరకు మార్నింగ్ , మాట్నీ షోల వివరాలు మాత్రమే.. ఇక ఫస్ట్ షో. రెండవ షో కలెక్షన్స్ వివరాలు రాలేదు. ఈ రెండు షోల కలెక్షన్లు వివరాలు వస్తే.. కలెక్షన్లలో భారీ మార్పులు వచ్చే అవకాశముంది. గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ బాలయ్య దూకుడుకు బాక్సాఫీస్ కలెక్షన్ తో పాటు అన్నిచోట్ల థియేటర్ ఫుల్ ఆక్యుపెన్సీ కూడా నమోదు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో జోరు ఈ వారం కనిపిస్తే.. కలెక్షన్స్ భారీగా పెరుగుతాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మువీ సంక్రాంతి సెలవుల్లో బాక్సాఫీస్‌ను మరింత కొల్లగొట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X